వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు యువకులను కాపాడిన ఎంపి హేమామాలిని

|
Google Oneindia TeluguNews

మథుర: సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటుసభ్యురాలు హేమామాలినికి శనివారం ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో బహిరంగ సభలో ఆమె చుట్టూ ప్రజలు గుమిగూడి ఇబ్బందికి గురిచేశారు.

ఆ సమయంలో ఆమె అక్కడి నుంచి తెలివిగా తప్పించుకొని, ప్రజల మధ్య తోపులాటలో చిక్కుకున్న ఇద్దరు యువకులను కాపాడారు. గోవర్ధన్‌ అసెంబ్లీ స్థానం పరిధిలోని రాల్‌గ్రామంలో 2,000 మందిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

hema malini

ఒక్కసారిగా ప్రజలు చుట్టూ గుమిగూడిపోవడంతో భద్రతా బలగాల సాయంతో తెలివిగా ఆమె తప్పించుకున్నారని ఆమె సన్నిహితులు మితుల్‌ పాఠక్‌ చెప్పారు. అదే సమయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఇద్దరు యువకులను చూసి భద్రతా బలగాలను ఆమె అప్రమత్తం చేశారని వెల్లడించారు.

వికలాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ

ఢిల్లీ: ప్రత్యేకంగా ఆర్డరుపై తయారు చేయించిన వంద ద్విచక్రవాహనాలను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం ఇక్కడ వికలాంగులకు అందచేశారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాహుల్‌గాంధీ 71వ జయంతి(ఆగస్టు, 20 తేదీ)ని పురస్కరించు కుని రాహుల్‌ ఈ వాహనాల తాళాలను వారికి ఇచ్చారు.

ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ వారందరితో కలివిడిగా మాట్లాడారు. వారి భవిష్యత్‌ ప్రణాళికల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. శారీరక దుర్బల పరిస్థితిని అధిగమించి మరీ చక్కటి విద్యార్హతలు సాధించిన వారందరినీ రాహుల్‌ మనసారా అభినందించారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ తరఫున యేటా వికలాంగులను సత్కరిస్తున్నారు. ఈ ఫౌండేషన్‌కు రాహుల్‌గాంధీ ట్రస్టీగా ఉన్నారు.

English summary
BJP MP Hema Malini on Saturday was mobbed during a public rally at Ral village here, with the actor-turned politician turning rescuer for two young boys who were caught in the melee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X