'స్టేజ్ గిర్ రాహా హై'తో 'బసంతి' ప్రసంగం ఖతమ్
మథుర: సినీ నటి హేమమాలినికి ప్రచారంలో చిక్కులు తప్పడం లేదు. రెండు గంటలు ఆలస్యంగా ప్రచార సభకు వచ్చిన మథుర బిజెపి అభ్యర్థి బసంతి హేమమాలిని మూడంటే మూడు నిమిషాలు మాత్రమే ప్రసంగించి, అర్థాంతరంగా స్టేజ్ గిర్ రహా హై (వేదిక కూలిపోతోంది)తో ముగించారు. షోలేలో బసంతి పాత్రతో విశేషమైన ప్రజాదరణ పొందిన హేమమాలిన మథుర నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మూడు గంటల పాటు నిరీక్షించిన ప్రజలు ఆమె రాగానే వేదిక వైపు దూసుకురావడానికి ప్రయత్నించారు. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మథుర రిఫైనరీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రాగానే పురుషులు, మహిళలు, పిల్లలు ఒక్కసారిగా వేదికవైపు దూసుకు వచ్చారు. నిర్వాహకులు నియంత్రించడానికి ప్రయత్నించినా ఫలితం లభించలేదు.

వేదిక కూలిపోతుందని దూరంగా ఉండాలని మైక్ ద్వారా హెచ్చరించినా ప్రజలు వినలేదు. ఈ గొడవలోనే హేమమాలిని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మూడు నిమిషాలు మాట్లాడారో లేదో ఏ వైపు వేదిక పడిపోతూ వచ్చింది. దీంతో ఆమె స్టేజ్ గిర్ రహా హై అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. వెంటనే హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వేదిక కూలిపోయే రీతిలో ప్రజలు దూసుకువచ్చారంటే బిజెపికి మద్దతు ఎంత ఘనంగా ఉందో ఊహించుకోవాలని బిజెపి నాయకులు సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications