ఎమ్మెల్యే నిర్బంధించి, రేప్ చేశాడు: జర్నలిజం విద్యార్థిని
భోపాల్: కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు హేమంత్ కటారే తనపై అత్యాచారం చేశాడని 21 ఏళ్ల జర్నలిజం విద్యార్థిని ఆరోపించింది. తనను నిర్బంధించి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే కటారే తనపై అత్యాచారం చేశాడని బాధిత యువతి జైళ్ల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు రాసిన లేఖలో ఆరోపించింది. దీంతో భోపాల్ మహిళా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

దాంతో కటారే కనిపించకుండా పోయాడు. గతంలో జర్నలిజం విద్యార్థిని అయిన ఆ యువతి తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని కటారే భోపాల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఇంతకు ముందు ఫిర్యాదు చేశారు. దానిపై కేసు నమోదు చేశారు.
ఆ ఫిర్యాదు తర్వాతే విద్యార్థిని రేప్ కేసు పెట్టింది. ప్రస్తుతం ఆ యువతి భోపాల్ సెంట్రల్ జైలులో ఉంది. బలవంతంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే పెట్టిన కేసులో ఆమెను అరెస్టు చేశారు.
కటారే నుంచి గతంలో రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందనే ఆరోపణపై జనవరి 24వ తేదీన ఆమెను అరెస్టు చేశారు. రెండు కోట్ల రూపాయలు ఇవ్వకపోతే రేప్ కేసు పెడుతానని కూడా ఆమె బెదిరించిందని కటారే చెప్పారు. కటారేను వేధించడానికే రేప్ కేసు నమోదు చేశారని కాంగ్రెసు పార్టీ విమర్శిస్తోంది.












Click it and Unblock the Notifications