భార్య మీద పక్కింటోళ్ల డేగకన్ను ! కొడవలితో నరికితే గుండెపోటుతో ప్రాణం పోయింది!
బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కష్టపడి పని చేస్తున్న భర్త అతని భార్య, పిల్లలను బాగా చూసుకుంటున్నాడు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారితో గొడవల కారణంగా దంపతులు విసిగిపోయారు. ఇదే సమయంలో పక్కింటిలో నివాసం ఉంటున్న ఇద్దరు మగాళ్లు భార్య మీద కొడవలితో దాడి చెయ్యడంతో భర్తకు గుండెపోటు వచ్చి అతను చనిపోవడంతో కలకలం రేపింది.
బెంగళూరు నగరంలోని చంద్రాలేఔట్ లోని గంగూండనహళ్లిలో ముదాసీర్ ఖాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ముదాసీర్ ఖాన్ కొన్ని సంవత్సరాల క్రితం రషీదా బేగం (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రషీదా బేగం, ముదాసీర్ ఖాన్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ముదాసీర్ ఖాన్, రషీదా బేగం దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ముదాసీర్ ఖాన్, రషీదా బేగం దంపతుల ఇంటి పక్కన వహీద్, మతీన్ అనే వాళ్లు నివాసం ఉంటున్నారు. చాలా కాలంగా ముదాసీర్ ఖాన్ భార్య రషీదా బేగం మీద కన్ను వేశారు. రషీదా బేగంను అనుభవించాలని కన్ను వేసిన వహీద్ ఆమెను మానసికంగా హింసించి లొంగదీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం భర్త ముదాసీర్ ఖాన్ కు చెబితే లేనిపోని గొడవలు జరుగుతాయని రషీదా బేగం సైలెంట్ గా ఉందని తెలిసింది.
అయితే రానురాను వహీద్, మతిన్ చేష్టలు ఎక్కువ కావడంతో రషీద్ బేగం విసిగిపోయింది. ఈ విషయం భర్త ముదాసీర్ కు చెప్పడంతో కొంతకాలం వహీద్, మతిన్ లతో ముదాసీర్ ఖాన్ గొడవపడటం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల నుంచి ముదాసీర్ ఖాన్ తో మతిన్, వహిద్ తో గొడవలు ఎక్కువ కావడంతో రెండు కుటంబాల మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి.
ముదాసీర్ ఖాన్ భార్య రషీద్ బేగం క్యారెక్టర్ సరిగా లేదని, ఆమెకు చాలా మందితో అక్రమ సంబందం ఉందని మతిన్, వహీద్ చుట్టుపక్కల వాళ్లకు ప్రచారం చేశారు. శుక్రవారం రాత్రి ఇదే విషయంలో ముదాసీర్ ఖాన్, వహీద్, మతిన్ ల మధ్య గొడవ జరిగింది. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో వహీద్, మతిన్ కొడవలి తీసుకుని వెళ్లి ముదాసీర్ ఖాన్ భార్య రషీదా బేగంను నరికేశారు.
భార్యను కొడవలితో నరకడంతో పక్కనే ఉన్న ముదాసీర్ ఖాన్ షాక్ కు గురి కావడంతో అతనికి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. వెంటనే ముదాసీర్ ను, కొడవలితో నరకడంతో తీవ్రగాయాలైన అతని భార్యను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై ముదాసీర్ ఖాన్ చనిపోయాడని చంద్రాలేఔట్ పోలీసులు తెలిపారు. ముదాసీర్ ఖాన్ భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో వహీద్, మతిన్ లను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరులోని చంద్రాలేఔట్ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications