• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సర్దార్ పటేల్ విగ్రహం వెనకున్న అసలైన ఉక్కుమనిషి ఈయనే..!

|

నోయిడా: గుజరాత్‌లో నర్మదా నదీ తీరాన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించిన సర్దార్ వల్లాభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి ప్రపంచ చర్చించుకుంటోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన విగ్రహంగా చరిత్రకెక్కింది. అయితే ఇంతటి అద్భుతమైన కళాఖండానికి ఊపిరి పోసింది మాత్రం ప్రముఖ శిల్పి రామ్ వంజి సుతార్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నుంచి స్ఫూర్తి పొందిన రామ్ వంజి సుతార్ ఇలాంటి ఒక విగ్రహాన్ని భారత్‌లో ఉంచాలని భావించారు. చిన్నప్పుడే తాను శిల్పిని కావాలని భావించారట. అతనికున్న సృజనాత్మకతను జోడించి చిన్నతనంలోనే చాలా విగ్రహాలు తయారు చేసేవారు. ప్రస్తుతం ఆయన వయస్సు 93 ఏళ్లు.

  పటేల్ విగ్రహం నవ భారతానికి ప్రతీక.. భావితరాలకు స్ఫూర్తి : మోదీ

  ఇక విగ్రహ విషయానికొస్తే నర్మదా నదీ తీరాన ఉన్న సర్దార్ సరోవర్ డ్యామ్ పై ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ 522 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటె రెండింతలు పెద్దదని చాలా గర్వంగా కూడా చెబుతారు సుతార్. సుతార్ స్టూడియో నోయిడాలో ఉంది. తన స్టూడియోను అక్కడి స్థానికులు విగ్రహాల పరిశ్రమగా పిలుచుకుంటారు. ఎందుకంటే బయటి నుంచి అతని స్టూడియోలోపలికి తొంగి చూస్తే భారీ విగ్రహాలు దర్శనమిస్తాయి. 2014లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం రూపొందించాల్సిందిగా సుతార్‌కు బాధ్యతలు అప్పగించింది భారత ప్రభుత్వం.

  70 ఏళ్ల కెరీర్‌లో 800కు పైగా కాంస్య విగ్రహాలు తయారు చేసిన రామ్‌ వన్జీ సుతార్

  70 ఏళ్ల కెరీర్‌లో 800కు పైగా కాంస్య విగ్రహాలు తయారు చేసిన రామ్‌ వన్జీ సుతార్

  సుతార్ 70 ఏళ్ల కెరీర్‌లో 800కు పైగా కాంస్య విగ్రహాలను తయారు చేశారు. ఇప్పటి వరకు తన కెరీర్‌ల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం కోసం చాలా కష్టపడినట్లు సుతార్ తెలిపారు. అంతేకాదు తాను చేసిన విగ్రహాల్లో ఇది ఒక కలికితురాయిలా మిగిలిపోతుందన్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌లోని గాంధీ సాగర్ డ్యామ్ వద్ద చంబల్ దేవత విగ్రహాన్ని తయారు చేసినట్లు సుతార్ వెల్లడించారు. ఆ విగ్రహం ఎత్తు 45 అడుగులు అని చెప్పారు. ఇది 1959లో తయారు చేసినట్లు వెల్లడించారు. ఇక సర్దార్ పటేల్ విగ్రహం విషయానికొస్తే ముఖ కవలికలు, ఆయన వ్యక్తిత్వం, తను దోతి కట్టుకున్న సమయంలో వచ్చే కుచ్చులను చెక్కడం అత్యంత కష్టంతో కూడుకున్న పని అని అయితే దీన్ని సవాలుగా స్వీకరించి విజయం సాధించినట్లు సుతార్ చెప్పారు.

  చైనాలో కాంస్యం పూత...177 టన్నుల కాంస్యం వినియోగం

  చైనాలో కాంస్యం పూత...177 టన్నుల కాంస్యం వినియోగం

  నోయిడా స్టూడియోలో 3 అడుగుల డిజైన్‌తో ప్రారంభమైన విగ్రహం, ఆ తర్వాత 18 అడుగుల మట్టి విగ్రహానికి రూపాంతరం చెందిందని... ఆ తర్వాత 30 అడుగులకు చేరుకుందని సుతార్ కుమారుడు అనిల్ సుతార్ వెల్లడించారు. ఆ తర్వాత 3డీ ఇమేజింగ్ సహాయంతో 522 అడుగుల భారీ థర్మాకోల్ మోడల్‌కు తీసుకువచ్చినట్లు అనిల్ సుతార్ తెలిపారు. అనిల్ సుతార్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిచి తాను ఒక శిల్పకళాకారుడిగా స్థిరపడ్డారు. విగ్రహం సుతార్ స్టూడియోలోనే తయారైనప్పటికీ...కాంస్యంతో కూడుకున్న పని మొత్తం చైనాలోని నాంన్‌చంగ్‌లో తయారైందన్నారు. ఇందుకోసం 177 టన్నుల కాంస్యాన్ని వినియోగించినట్లు అనిల్ వెల్లడించారు. ఈ విగ్రహ పనులను పర్యవేక్షించేందుకు తండ్రీ కొడుకులు చైనాకు పలుమార్లు వెళ్లినట్లు చెప్పారు. అక్కడ కాంస్యం పని పూర్తయ్యాక చైనా నుంచి భారత్‌కు పడవలో రవాణా చేసినట్లు అనిల్ తెలిపారు. భారీ విగ్రహాలకు కాంస్య పట్టీ పూసే కర్మాగారాలు మనదేశంలో లేవని అనిల్ సుతార్ చెప్పారు. తన కర్మాగారంలోని విగ్రహాలకు రోజుకు 10 టన్నుల కాంస్యం పట్టీ మాత్రమే వినియోగించే వీలుంటుందని చెప్పిన అనిల్ సుతార్... చైనాలో అయితే 400 టన్నుల కాంస్య పట్టీ పూసే వీలుందని చెప్పారు. అయితే ఇప్పుడు చైనా తరహాలోనే మనదేశంలో కూడా ఆస్థాయి కర్మాగారం ఒకటి ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

  93 ఏళ్ల వయస్సులోనూ చలాకీగా పనిచేసే సుతార్

  93 ఏళ్ల వయస్సులోనూ చలాకీగా పనిచేసే సుతార్

  ఇక ప్రధాని నరేంద్ర మోడీ మానసపుత్రిక ప్రాజెక్టు అయిన సర్దార్ వల్లాభాయ్ పటేల్ కాంస్య విగ్రహ తయారీ తర్వాత సుతార్లకు మరో కొన్ని ఆర్డర్లు తమ ముందుకొచ్చాయి. ఇప్పటికే 400 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ విగ్రహం డిజైన్ పూర్తవగా... రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 250 అడుగు విగ్రహా తయారీకి ఆర్డర్లు వచ్చాయి. రెండు ముంబైలోనే ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే ఈ రెండు విగ్రహాలు నోయిడా స్టూడియోలోపలికి బయటి నుంచి చూస్తే కనిపిస్తాయి. వయస్సు మీద పడుతున్నప్పటికీ విగ్రహతయారీపై ఆయనకున్న ప్రేమ ఎంతమాత్రం తగ్గలేదు. 93 ఏళ్ల వయస్సులోను రామ్ వన్జీ సుతార్ నోయిడా స్టూడియోలోకి ఉదయం 11 గంటలకు వచ్చి 8గంటల పాటు విగ్రహతయారీలో నిమగ్నమైతారు . సగటున 12 అడుగుల విగ్రహాలను ఇక్కడ తయారు చేస్తారు. అవన్నీ ఎక్కువగా రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలవే ఉంటాయి. మహాత్మా గాంధీ విగ్రహాల తయారీతోనే రామ్ వన్జీ సుతార్ పాపులర్ అయ్యారు.

  పార్లమెంటు ముందున్న గాంధీ విగ్రహమంటే చాలా ఇష్టం

  పార్లమెంటు ముందున్న గాంధీ విగ్రహమంటే చాలా ఇష్టం

  ఇక ఎన్నో గాంధీ విగ్రహాలను అందంగా చెక్కిన సుతార్‌కు ... వ్యక్తిగతంగా తాను ఎక్కువగా ఇష్టపడే విగ్రహం మాత్రం పార్లమెంటు ముందు ధ్యానం చేస్తూ కూర్చున్న మహాత్మా గాంధీ విగ్రహం.ఇది 16 అడుగుల కాంస్య విగ్రహం. తన హస్తం నుంచి జాలువారిన అందమైన మహాత్ముడి విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా 350 నగరాల్లో ఉన్నాయని చాలా గర్వంగా చెబుతారు రామ్ వన్జీ సుతార్. వీటన్నిటినీ పలు దేశ ప్రభుత్వాలకు బహుమానంగా భారత ప్రభుత్వం అందజేసిందని చెప్పారు. తాను తొలిసారిగా 1948లో మహారాష్ట్రలోని ధూలే జిల్లాలోని ఓ పాఠశాల కోసం గాంధీ విగ్రహం చేసినట్లు గుర్తుచేసుకున్నారు. అప్పటికీ ఆయన వయస్సు 23 ఏళ్లు మాత్రమేనట. కానీ తాను తయారు చేసిన తొలి విగ్రహం మాత్రం ఏడు అడుగుల బాడీబిల్డర్‌ది అని దాన్ని 1947లో తయారు చేసినట్లు చెప్పారు. ఇక ప్రొఫెషనల్ శిల్పిగా మారిన తర్వాత తను తయారు చేసిన తొలి విగ్రహం పండిట్ గోవింద్ వల్లబ్ పంత్‌ది. దీన్ని 1966లో తయారు చేసినట్లు చెప్పిన సుతార్... 10 అడుగుల ఎత్తుతో తయారు చేసినట్లు వివరించారు. దీన్ని దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టించారు.

  అత్యంత పొడవైన మహాత్ముడి విగ్రహం తయారు చేయడమే లక్ష్యం

  అత్యంత పొడవైన మహాత్ముడి విగ్రహం తయారు చేయడమే లక్ష్యం

  పండిట్ గోవింద్ వల్లబ్ పంత్‌ విగ్రహం తర్వాత తనకు చాలా ఆర్డర్లు వచ్చాయని... గాంధీ నుంచి నెహ్రూ, అంబేడ్కర్, రామ్‌మనోహర్ లోహియా వరకు విగ్రహాలు తయారు చేసినట్లు చెప్పారు. అంతేకాదు ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పలువురి దళిత నేతల విగ్రహాలతో పాటు తన విగ్రహం కూడా తయారు చేయించుకున్నారని చెప్పారు సుతార్. శిల్పకళారంగంలో తన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో తనను పద్మభూషణ్‌తో గౌరవించింది. ఇక తన ముందున్న లక్ష్యం ఒకటే అని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని తయారు చేయడమే అని వెల్లడించారు. ప్రపంచానికి శాంతి మంత్రాన్ని బోధించిన మహాత్ముడి విగ్రహాన్ని తయారు చేసి తీరుతానని చెప్పారు.

  మరిన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ వార్తలుView All

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Meet Ram Vanji Sutar, 93, the sculptor behind the 522­-feet Statue of Unity of Sardar Patel and the 400­feet Chhatrapati Shivaji statue in Mumbai.As a teenager, Ram Vanji Sutar had been fascinated by the Statue of Liberty – not just by what it stood for but also by how tall it stood on the Liberty Island in New York. From an early age, he had known that he wanted to be a sculptor and he grew up dreaming of creating a statue that would dwarf French sculptor Frédéric Auguste Bartholdi’s 305-ft neoclassical robed female figure.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more