జయలలిత ఎఫెక్ట్: రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రానికి ముఖ్య కారణాలు ఇవే!

Posted By:
Subscribe to Oneindia Telugu
Rajini On Jayalalithaa : జయలలిత ముఖ్యమంత్రి అయితే దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు

చెన్నై: అభిమానులు ఏళ్లుగా చూస్తున్న ఎదురుచూపులు ఫలించాయి. రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్ర ప్రకటనతో ఇన్నాళ్లుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ఇన్నాళ్లుగా రాజకీయాల్లోకి రాని, అభిమానులు ఎంతగా పిలిచినా మౌనం వహించిన రజనీ ఇప్పుడు ఎందుకు వచ్చారనే చర్చ సాగుతోంది.

రాజకీయాల్లోకి వస్తున్నా, ద్రోహం చేయలేను, పిరికివాడు అంటారు, మీడియాతో భయం: రజనీకాంత్ సంచలనం

ఇందుకు కొన్ని సమాధానాలు ఆయనే చెప్పారని అంటున్నారు. అందులో ఒకటి రాజకీయాల్లో మార్పు రావాలని, దేశ రాజకీయాలు చెడిపోయాయని ఆయన త న ప్రసంగంలో గుర్తు చేశారని అంటున్నారు. అలాగే, తమిళనాడులోని తాజా రాజకీయాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకే దారిలో పవన్ కళ్యాణ్ - రజనీకాంత్

 రజనీ రావడానికి కారణాలు

రజనీ రావడానికి కారణాలు

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి మూడు నాలుగు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ శూన్యత. అమ్మ జయలలిత మృతి అనంతరం తమిళనాడు రాజకీయాల్లో శూన్యత కనిపిస్తోంది.

 అన్నాడీఎంకేలోని పరిణామాలు

అన్నాడీఎంకేలోని పరిణామాలు

జయ మృతి అనంతరం అధికార అన్నాడీఎంకేలోని పరిణామాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే. ఒకటి నుంచి రెండు.. మూడు వర్గాలుగా విడిపోయాయి. ఇప్పుడు ప్రధానంగా శశికళ వర్గం, పళని-పన్నీరు వర్గాలు ఉన్నాయి. అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతున్నారనే విధంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇది కూడా రజనీకి ఆవేదన కలిగించిందని చెబుతున్నారు.

 రాజకీయ ప్రక్షాళన

రాజకీయ ప్రక్షాళన

దేశ రాజకీయాలు కలుషితమయ్యాయని, మార్పు తీసుకు రావాలని రజనీకాంత్ అన్నారు. దేశ రాజకీయాలు, ప్రస్తుత తమిళనాడు పరిస్థితులను చూశాక తాను రాకుంటే తప్పు చేసిన వాడిని అవుతానని వ్యాఖ్యానించారు. కల్మషం, కలుషితం లేని రాజకీయాల కోసం ఆయన ఆరంగేట్రం చేస్తున్నారని అభిమానులు చెబుతున్నారు.

 కమల్ హాసన్ ట్వీట్‌పై రజనీ స్పందన

కమల్ హాసన్ ట్వీట్‌పై రజనీ స్పందన

ఇదిలా ఉండగా, కమల్ హాసన్ తనకు శుభాకాంక్షలు తెలపడంపై రజనీకాంత్ స్పందించారు. కమల్ శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు అన్నారు. నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలు, కల్మషం లేని రాజకీయాలు కావాలంటే రాజకీయాల్లో ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండాలని రజనీ అంతకుముందు పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో వ్యాఖ్యానించారు. త్వరలో ప్రజలను కలుస్తానని, యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Here is the big 4 reason of Rajnikanth announcement of entry in politics of Tamilnadu. He has a challenge to fill the political vacuum in the state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి