వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిల్లర రాజకీయాలు మానుకోండి: రజినీకి అండగా రంగంలోకి ధనుష్

తాజాగా రజినీకాంత్‌కు ఆయన అల్లుడు, ప్రముఖ నటుడు ధనుష్ కూడా మద్దతు తెలిపారు. రజినీ స్థానికతపై పలు సంఘాలు ఆందోళన చేపట్టడాన్ని ధనుష్ తప్పుబట్టారు. వారివి చిల్లర రాజకీయాలంటూ మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం, ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న డీఎంకే అధినేత కరుణానిధి కూడా వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరం కావడంతో తమిళ రాజకీయాల్లో సంక్షోభం నెలకొన్నట్లయింది.

బీజేపీ సీఎం అభ్యర్థి రజినీకాంత్!: తేల్చేసిన కేంద్రమంత్రి పోన్బీజేపీ సీఎం అభ్యర్థి రజినీకాంత్!: తేల్చేసిన కేంద్రమంత్రి పోన్

పక్కా తమిళుడినే..

పక్కా తమిళుడినే..

ఈ సమయంలో రాజకీయాల్లోకి వస్తానంటూ రజినీకాంత్ సంకేతాలివ్వడంతో ఆయన అభిమానులు, మెజార్టీ ప్రజలు సానుకూలంగా స్పందించారు. అయితే, కొందరు రాజకీయ నేతలు, సంఘాలు.. రజినీ స్థానికతను తెరపైకి తెచ్చి ఆందోళన చేపట్టారు. రజినీ తమిళుడు కాదని పేర్కొంటూ ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే, వీరికి కౌంటర్‌గా రజినీ అభిమానులు కూడా భారీ ఆందోళన చేపట్టారు. రజినీ కూడా తాను పక్కా తమిళుడినేనంటూ స్పష్టమైన ప్రకటన చేశారు.

చిల్లర రాజకీయాలు మానుకోండి

చిల్లర రాజకీయాలు మానుకోండి

కాగా, తాజాగా రజినీకాంత్‌కు ఆయన అల్లుడు, ప్రముఖ నటుడు ధనుష్ కూడా మద్దతు తెలిపారు. రజినీ స్థానికతపై పలు సంఘాలు ఆందోళన చేపట్టడాన్ని ధనుష్ తప్పుబట్టారు. వారంతా ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రజినీ రాజకీయాల్లోకి వస్తే తమిళ ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు. రాజకీయ ప్రవేశంపై రజినీ ఏ నిర్ణయం తీసుకున్నా తన మద్దతు ఉంటుందని ధనుష్ స్పష్టం చేశారు. తమిళ ప్రజల గుండెల్లోనే రజినీ ఉన్నారని ధనుష్ తెలిపారు.

వివాదమెందుకు?

వివాదమెందుకు?

ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ప్రతీ ఒక్కరికి ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు రజినీని మంచి మనిషిగా గుర్తించిన నేతలు.. రాజకీయాల్లోకి వస్తారనగానే ఇలా స్థానికతపై వివాదం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కొన్ని తమిళ సంఘాలు ఆందోళనల నేపథ్యంలో రజినీకి భద్రత పెంచాలంటూ పలు హిందూ సంఘాలు పోలీసులను ఆశ్రయించాయి.

అండగా ధనుష్

అండగా ధనుష్

కాగా, రజినీకాంత్ సొంత పార్టీ పెడతారా? లేక బీజేపీలో చేరతారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్.. తమ పార్టీలో చేరితే రజినీకాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ తేల్చి చెప్పారు. అంతేగాక, త్వరలోనే రజినీకాంత్.. ప్రధాని మోడీని కలిసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే, ప్రస్తుతం ధనుష్.. తన మామ రజినీకాంత్‌కు అన్ని విధాలా అండగా ఉంటున్నట్లు సమాచారం.

English summary
Dhanush said that whatever decisions Rajaini take, it will always be right. There is no pressure in the family about his political speech, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X