చిరంజీవి కూతురుగా బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్‌.. ఎవరంటే..?

మెగాస్టార్ చిరంజీవి ఓ నట శిఖరం. నాలుగు దశాబ్దాలుగా చిత్ర సీమలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్నారు. ఏడు పదుల వయసులోనూ ఇండస్ట్రీ రికార్డ్స్ ను బద్దలు కొడుతూ.. నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ అన్నట్లుగా దూసుకెళ్తున్నారు. ఇటీవల మన శంకర్ వర ప్రసాద్ మూవీతో రీజినల్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు బాబీ తో మరో సినిమా చేస్తున్నారు. వీరి కాంబోలో గతంలో వచ్చిన వాల్తేర్ వీరయ్య మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతున్న క్రమంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

అయితే చిరు- బాబీ కాంబోలో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో చిరంజీవి కుమార్తెగా ఓ యంగ్ హీరోయిన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు.. మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ అని సమాచారం. ఈమె మలయాళం సినిమాల్లో చాలా ఫేమస్.. రేఖ చిత్రంతో గతేడాది మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే ఛాంపియన్ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టి తొలి సినిమాకే సూపర్ హిట్ అందుకుంది. అలాగే తమిళంలోనూ విత్ లవ్ అనే యూత్ ఫుల్ లవ్ స్టోరీ సినిమాలో నటించి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకుంది.

AnaswaraRajan to Play Chiranjeevi s Daughter in Upcoming Bobby Directorial Tollywood latest news

ఈ మేరకు చిరంజీవి- బాబీ సినిమాలో చిరంజీవి కూతురుగా అనస్వర రాజన్ నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మూవీలో తండ్రీ- కూతుళ్ల మధ్య సాగే సెంటిమెంట్ మూవీకి చాలా కీలకం కానున్నట్లు సమాచారం. కథ మొత్తం కూతురి చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. అందుకే ఈ పాత్రకు హీరోయిన్ ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ మేరకు అనస్వర రాజన్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ మలయాళీ బ్యాటీ ఇప్పటికే తెలుగులో ఛాంపియన్ మూవీతో హిట్ అందుకుంది. ఇప్పుడు చిరంజీవి సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో ఫ్యూచర్ లో భారీగా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+