కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై, బీఆర్ఎస్ లో చేరిక - కేసీఆర్ హామీతో..!?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలతో సొంత పార్టీ సీనియర్లు ఇబ్బంది పడుతున్నారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ లో అనేక హోదాల్లో పని చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ వీడాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. తాజాగా కేటీఆర్ ఆయనతో నేరుగా మాట్లాడినట్లు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ నుంచి తన భవిష్యత్ పై వచ్చిన హామీతో గులాబీ కండువా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. కొంత కాలం గా ఆయన పార్టీలో ప్రాధాన్యత లేకపోవటం.. ఇతర పార్టీ నుంచి వచ్చిన వారు తన నియోజక వర్గం లో పెత్తనం చేయటం పైన అసహనంతో ఉన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ జెండా మోసిన ఒక సీనియర్ నేత అయిన తాను ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేనని తేల్చి చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీన తన రాజీనామాను ప్రకటించేందుకు సిద్దమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. రాజకీయంగా సంజయ్ కుమార్‌తో పోరాడిన జీవన్ రెడ్డి, ఇప్పుడు అదే నాయకుడికి పార్టీలో పెద్దపీట వేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు నుంచి చైర్‌పర్సన్ ఎంపిక వరకు సంజయ్ కుమార్ మాటే చెల్లుబాటు కావడం, జీవన్ రెడ్డి వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టడంతో తనకు అవమానాలు ఎదురవుతున్న పార్టీలో తాను ఉండలేనని చెబుతున్నారు.

కేసీఆర్ హామీతో బీఆర్ఎస్ లో చేేరికకు నిర్ణయం..?
నియోజకవర్గంలో పదవుల విషయంలో.. పార్టీ కార్యక్రమాల్లో తనకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవటం తో జీవన్ రెడ్డి నేరుగా కేసీఆర్ తో మాట్లాడినట్లు సమాచారం. ఆ తరువాత కేటీఆర్ తో పలు మార్లు చర్చలు జరిగాయని తెలుస్తోంది. బీఆర్ఎస్ లో చేరితే ఆయనకు సముచిత గౌరవం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి వంటి నేత పార్టీలోకి వస్తే ఉత్తర తెలంగాణలో తమ బలం పెరుగుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే తన అనుచరులు, ఆత్మీయులతో భేటీ అయిన జీవన్ రెడ్డి వారి సూచన మేరకే తుది నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి, కాంగ్రెస్‌కు అధికారికంగా రాజీనామా చేసే అవకాశం ఉంది. జగిత్యాలలో తన బలాన్ని నిరూపించుకునేలా భారీ బలప్రదర్శనతో గులాబీ కండువా కప్పుకోవటం దాదాపు ఖాయమైంది. జీవన్ రెడ్డి తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ తర్వాత సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. తన పరిస్థితిపై పార్టీ నాయకత్వంతో పాటు ఢిల్లీ నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి కాంగ్రెస్ పేరును తొలగించడంతో ఆయన పార్టీని వీడేది ఖాయమని తేలి పోయింది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications