Vijayasai Reddy: కొత్త లుక్ లో విజయసాయిరెడ్డి -పొలం పనుల్లో బిజీగా..!

ఒకప్పుడు వైఎస్సార్సీపీ హయాంలో ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత అధికారం కోల్పోయాక రాజకీయాలకు, ఎంపీ పదవికీ గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి (vijayasai reddy) వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. దీంతో అంతా నిజమని భావించారు. కానీ కొంతకాలం తర్వాత తిరిగి ఏపీ మద్యం స్కాంపై సీఐడీ దర్యాప్తు చేస్తుంటే తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆ తర్వాత సీఐడీ తనను కూడా నిందితుడిగా చేర్చడంతో తిరిగి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ రూటు మార్చారు.

ఇప్పుడే రాజకీయంగా చేయడానికి ఏమీ లేదనుకున్నారో ఏమో మళ్లీ విజయసాయిరెడ్డి వ్యవసాయం బాట పట్టారు. సొంత జిల్లా నెల్లూరులోని శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం లో భాగంగా అగ్నాస్త్రం మిరపచెట్లకు స్ప్రే చేస్తున్నామని సాయిరెడ్డి ఇవాల ట్వీట్ చేశారు. అగ్నాస్త్రం తయారీకి గోవుమూత్రం, నూరిన వేపాకులు, వెల్లుల్లి, మిరపకాయలు, పొగాకు ప్లాస్టిక్ డ్రమ్ము లో వేసి బాగా కలియబెట్టి, మరగపెట్టి 24 గంటలపాటు నిల్వవుంచి వడపోసి ఆపై చెట్లకు స్ప్రే చేస్తామని సాయిరెడ్డి ఇందులో వివరించారు. అలా స్ప్రే చేస్తున్న వీడియోను కూడా ఇందులో షేర్ చేశారు.

Vijayasai Reddy Agriculture Keeps Former MP Busy Ahead of Potential Political Re-Entry plans

దీంతో సాయిరెడ్డి ఇంత అర్జంటుగా వ్యవసాయంలోకి దిగాల్సిన అవసరం మళ్లీ ఎందుకొచ్చిందా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు సాయిరెడ్డి ఏదో ఒక రోజు వైఎస్సార్సీపీలో తిరిగి ఎంట్రీ ఇస్తారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. కానీ వైసీపీలో పరిస్ధితులు భిన్నంగా ఉన్నాయి. సాయిరెడ్డి కోటరీగా ఆరోపణలు చేస్తున్న సజ్జల వర్గం హవా కొనసాగుతున్నంత కాలం జగన్ దగ్గర ఆయనకు ఎంట్రీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీంతో బీజేపీకి దగ్గరయ్యేందుకు ఈ మధ్య హిందూత్వ వాదాన్ని సాయిరెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్నారు. మతమార్పిడులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+