సూసైడ్ విషయంలో వాళ్లకు శిక్ష పడాల్సిందే: సుప్రీమ్ కోర్టు
సూసైడ్స్ విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సూసైడ్స్‌కు ప్రేరేపించిన వ్యక్తి శిక్షకు అర్హుడనే సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఇది సూసైడ్‌కు ప్రేరేపించిన కేసు. బాధితులకు వేరే మార్గం లేకుండా పోయి, ప్రేరేపించిన వెంటనే ఆ వ్యక్తి సూసైడ్‌కు పాల్పడినప్పుడు.. సూసైడ్‌కు ప్రేరేపించిన వ్యక్తిని దోషిగా నిర్ధారించవచ్చని కోర్టు ఈ కేసులో తీర్పును వెలువరించింది.
ఈ కేసు అశోక్‌కుమార్ అనే వ్యక్తి భార్యకు సంబంధించనది. అశోక్‌కుమార్ భార్య సందీప్ బన్సాల్ అనే వ్యక్తి వద్ద 40వేల రూపాయలను అప్పుగా తీసుకుంది. అయితే, ఆ డబ్బు చెల్లించలేని పరిస్థితిలో మరికొన్ని రోజుల్లో డబ్బు చెల్లిస్తానంటూ అశోక్ సందీప్‌ను కోరాడు. సందీప్ మాత్రం అశోక్ పట్ల దురుసుగా ప్రవర్తించి అతనిని అసభ్య పదజాలాంతో దూషించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అశోక్ భార్య తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.

అయితే, ఈ విషయంపై అసభ్యకరమైన పదజాలంతో సూసైడ్‌కు ప్రేరేపించిన వ్యక్తిని దోషిగా నిర్ధారించలేమని గతంలో కోర్టులో తీర్పును వెలువరించింది. అయితే, ఇలాంటి వ్యాఖ్యలు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పరిగణించబడుతుందా లేదా అనే ప్రశ్న గతంలో తలెత్తింది. ఇప్పడు జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఆత్మహత్యకు ప్రేరేపించిన వారు శిక్షకు అర్హులే అంటూ ఒక సంచలన తీర్పును ప్రకటించిది.
కోటా ఆత్మహత్యల కేసులో కూడా ఇదే తరహా తీర్పు..
ఈ సంవత్సరం ఒక్క కోటాలోనే 24 మంది చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు. స్టూడెంట్స్ సూసైడ్ కేసులో కూడా ఇదే తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. ఆత్మహత్యలకు పిల్లల తల్లిదండ్రులే బాధ్యులని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొంది. ఆ సమయంలో, కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కోర్టు నిరాకరించింది. దీనికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలని కోరింది.












Click it and Unblock the Notifications