హిడ్మా లొంగుబాటు నిజంకాదు; ప్లాన్ ప్రకారం పోలీసుల ప్రచారం; హిడ్మా కోసం ఆపరేషన్ ప్రహార్!!
మావోయిస్టు పార్టీని బలహీనం చేసే పనిలో తెలంగాణ, చత్తీస్ గడ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మాడవి హిడ్మా టార్గెట్ గా చత్తీస్గడ్, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన మెరుపు దాడి గతేడాది ఒక్కసారిగా దేశాన్ని షాక్ కు గురి చేసింది. సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని టెర్రాం వద్ద మావోయిస్టులు జరిపిన వ్యూహాత్మక దాడిలో 24 మంది జవాన్ల మరణంతో ప్రతీకారం తీర్చుకోవటానికి రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు అప్పటినుండి ఈ దాడికి కారణమైన హిడ్మా ఏరివేత కోసం శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.

పోలీసుల ముందు లొంగిపోయిన మాడవి హిడ్మా .. తప్పుడు వార్తన్న మావోలు
ఈ క్రమంలో తాజాగా మాడవి హిడ్మా లొంగిపోయాడు అంటూ పోలీసులు ప్రకటన చేశారు. తెలంగాణ చత్తీస్ఘడ్ రెండు రాష్ట్రాల్లోనూ హిడ్మా లొంగిపోయాడు అంటూ వస్తున్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ బలహీనమవుతుంది, ముఖ్య నాయకులు లొంగి పోతున్నారు అన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మావోయిస్టు పార్టీలో సైతం ఏం జరుగుతుందో అన్న ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే పోలీసులకు లొంగిపోయిన హిడ్మా , మావోయిస్టు పార్టీ మిలిషియా సభ్యుడు హిడ్మా ఒక్కరు కాదని మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. పోలీసులు ప్లాన్ ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మావోయిస్టు పార్టీ పేర్కొంది.

మావోయిస్ట్ పార్టీని దెబ్బ కొట్టటం కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న మావోలు
మావోయిస్టు పార్టీ సభ్యుడు, బెటాలియన్ కమాండర్ మాడవి హిద్మా తెలంగాణ పోలీసులకు లొంగిపోయారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సిపిఐ (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డికెఎస్‌జెడ్‌సి) తీవ్రంగా ఖండించింది. పార్టీ విడుదల చేసిన ప్రకటనలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్, విప్లవ ఉద్యమానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రతి-విప్లవ వ్యూహాత్మక దాడి సమాధాన్‌లో కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు ప్రహార్ దాడిని తీవ్రతరం చేస్తున్నాయని ఆరోపించారు. మరొక వైపు అసత్యాలు మరియు అర్ధ సత్యాలను వ్యాప్తి చేయడం ద్వారా మావోయిస్టు పార్టీని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

హిడ్మా గెరిల్లా స్థావరాలలో దండకారణ్య ప్రజలలో ఉన్నారన్న మావోయిస్ట్ పార్టీ
వాస్తవాలను వక్రీకరిస్తూ మావోయిస్టులపై అసత్య, దుష్ప్రచారాలు చేస్తున్నారని, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ బెటాలియన్ కమాండర్, సెక్రటేరియట్ సభ్యుడు, హిడ్మా గెరిల్లా స్థావరాలలో దండకారణ్య ప్రజలలో ఉన్నారని వికల్ప్ చెప్పారు. అణగారిన వర్గాలు, సామాజిక వర్గాలు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, దేశభక్తులు తప్పుడు ప్రచారాలను, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల మైండ్ గేమ్ ను తీవ్రంగా ఖండించాలని, తీవ్రంగా వ్యతిరేకించాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పిలుపునిస్తోందని ఆయన తెలిపారు.

పోలీసుల ముందు లొంగిపోయిన హిడ్మా... కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఒక్కరు కాదు
పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో లొంగిపోయిన మాడవి హిడ్మా వయసు 25 సంవత్సరాలు అని, అతని స్వగ్రామం సుక్మా జిల్లా కిష్టాపురం మండలం తొండ మార్క గ్రామం అని పేర్కొన్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టి లో ఉన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గెరిల్లా బెటాలియన్ కమాండర్ మాడవి హిడ్మా వయసు 45 సంవత్సరాలు అని, స్వగ్రామం సుక్మా జిల్లా పువర్తి గ్రామం అని ప్రకటించారు. రెండు పేర్లు ఒకే విధంగా ఉండటంతో పోలీసులు కావాలని హిడ్మా లొంగిపోయినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది.

మావోయిస్ట్ కమాండర్ గా హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు
మావోయిస్టుల లేథల్ బెటాలియన్ 1 యొక్క కమాండర్ హిడ్మా భద్రతా దళాలకు వ్యతిరేకంగా కార్యకలాపాల యొక్క ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించటంలోఅందెవేసిన చెయ్యి.హిడ్మలు అని కూడా పిలువబడే హిడ్మా బీజాపూర్ లోని స్థానిక తెగకు చెందినవాడు. అతను 2001 ప్రారంభంలో నక్సల్స్‌లో చేరినట్లు సమాచారం. హిడ్మాచాలా క్రమశిక్షణ, తెలివైన, పదునైన వ్యక్తి . అంతే కఠినంగా ప్రవర్తించ గలిగిన వ్యక్తి అని , అందుకే అతను కమాండర్‌గా ప్రాముఖ్యత పొందాడని తెలుస్తుంది .హిడ్మా భద్రతా దళాలపై మెరుపు దాడులు చేయటంలో దిట్ట . 2004 నుండి, అతను సిబ్బందిపై 27 కి పైగా దాడులకు పాల్పడ్డాడు.
Recommended Video

మెరుపు దాడుల్లో దిట్ట, 27కి పైగా కేసులు, ఆపరేషన్ లో ప్రహార్ లో పట్టుకోలేకపోయిన పోలీసులు
ఫ్రంట్‌లైన్ కాంగ్రెస్ నాయకుల 2013 జిరామ్ ఘాటి ఊచకోత , ఏప్రిల్ 2017 బుర్కపాల్ ఆకస్మిక దాడి, ఇందులో 24 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మరణించారు. 76 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మృతి చెందిన దంతేవాడ దాడి ఘటనలో కూడా ఆయన కీలక భూమిక పోషించారు. దంతేవాడ దాడిలో, హిడ్మా ముందు ఉండి నడిపించాడు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్జి), చత్తీస్గడ్ పోలీసు జిల్లా ఫోర్స్, సిఆర్పిఎఫ్ మరియు దాని ఉన్నత వర్గాల నుండి సుమారు 2 వేల మంది భద్రతా సిబ్బంది హిడ్మా కోసం గత ఏడాది నుండి వేటాడుతూనే ఉన్నారు.కోబ్రా యూనిట్ - ఏప్రిల్ 2 2021న సంయుక్త ఆపరేషన్ ప్రారంభించింది.హిడ్మా లక్ష్యంగా ఆపరేషన్ ప్రహార్ 3 ను చేపట్టినా ఇప్పటివరకు హిడ్మాను పట్టుకోలేక పోయింది. ఈ క్రమంలోనే తాజాగా పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు హిడ్మా, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గెరిల్లా బెటాలియన్ కమాండర్ మాడవి హిడ్మాగా ప్రచారం జరుగుతుంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications