బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీలంక వరుస బాంబు పేలుళ్లు, ఫోన్ బెదిరింపులు, బెంగళూరులో హై అలర్ట్, ఆంధ్రా, తెలంగాణలో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని వెలుగు చూడటంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీసు కమిషనర్ సునీల్ కుమార్ తెలిపారు. నగరంలో ఎలాంటి బాంబు పేలుళ్లు జరగడానికి అవకాశం ఇవ్వమని పోలీసు కమిషనర్ సునీల్ కుమార్ అన్నారు.

బెంగళూరు పోలీసు కంట్రోల్ రూంకు ఇటీవల బాంబు బెదిరింపు పోన్లు వచ్చాయి. ఈ బాంబు బెదిరింపు ఫోన్ల ఆదారంగా సరిహద్దుల్లోని 8 రాష్ట్రాలకు కర్ణాటక డీజీపీ నిలమణి రాజు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరితో పాటు కర్ణాటకలోని అన్ని జిల్లాల అధికారులకు డీజీపీ నిలమణి రాజు లేఖలు రాసి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని సూచించారు.

High alert in Bengaluru again after Sri Lanka blasts

ఈ సందర్బంలోనే బెంగళూరులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని నగర పోలీసు కమిషనర్ సునీల్ కుమార్ తెలిపారు. ఏఫ్రిల్ 21వ తేదీ శ్రీలంకా రాజధాని కోలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో వందలాది మంది మరణించారు.

సుమారు 500 మంది వరకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. .శ్రీలంకాలో జరిగిన వరుస బాంబు పేలుళ్లు బెంగళూరులో జరగకుండా పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. బెంగళూరు నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
Bengaluru city police commissioner T Suneel Kumar said, High alert declared in highly populated places in Bengaluru again, after Sri lanka blast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X