డేరా బాబా ఆ హత్య చేయలేదట
Dera Baba Gurmeet Ram Rahim Singh: హర్యానాకు చెందిన ప్రముఖ ప్రబోధకుడు, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు ఊరట లభించింది. హత్య కేసులో ఆయనను పంజాబ్ హర్యానా హైకోర్టు నిర్దోషిగా గుర్తించింది. డేరా బాబాతో పాటు మరో నలుగురిపై నమోదైన హత్యకేసును కొట్టివేసింది.
2002 నాటి హత్య కేసు ఇది. డేరా సచ్చా సౌదా మేనేజర్ రంజిత్ సింగ్‌ను మరో నలుగురితో కలిసి హత్య చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు గుర్మీత్ రామ్ రహీం సింగ్. కురుక్షేత్రలోని థానేశ్వర్‌లో 2002 జులై 10వ తేదీన ఆయన హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది.

అప్పటి ప్రభుత్వం దీన్ని సీబీఐకి అప్పగించింది. రంజిత్ సింగ్‌తో పాటు జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్యకేసులో కూడా డేరాబాబాను దోషిగా గుర్తించింది సీబీఐ. 2021 అక్టోబర్18వ తేదీన హర్యానా పంచ్‌కులలోని సీబీఐ న్యాయస్థానం సైతం డేరా బాబాను దోషిగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ హత్యకేసులో డేరా బాబాతో పాటు అవతార్ సింగ్, క్రిషన్ లాల్, జస్బీర్ సింగ్, సబ్దిల్ సింగ్ దోషులుగా తేలారు. ఐపీసీలోని సెక్షన్లు 302, 120 బీ కింద వారికి శిక్షను ఖరారు చేసింది. జైలు శిక్షతో పాటు డేరా బాబాపై 31 లక్షల రూపాయల జరిమానా సైతం విధించింది సీబీఐ కోర్ట్. అనంతరం వాళ్లు పంజాబ్ హర్యానా హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లారు. సీబీఐ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు.
అప్పీల్ పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని విచారించింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సమక్షానికి అధికారులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించింది. వాటిపై విచారణ కొనసాగించిన అనంతరం డేరా బాబాతో పాటు ఆ నలుగురినీ నిర్దోషులుగా గుర్తించింది. ఈ మేరకు జస్టిస్ సురేశ్వర్ థాకూర్, జస్టిస్ లలిత్ బాత్రాతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.












Click it and Unblock the Notifications