వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిండు గర్భిణికి హై రిస్క్ ఓపెన్ హార్ట్ సర్జరీ... విజయవంతం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

జైపూర్: ఏడు నెలల గర్భిణికి అత్యంత రిస్క్‌తో కూడిన ఓపెన్ హార్ట్ సర్జరీని జైపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న నిర్మల అనే గర్భిణి గత జనవరిలో ఆసుపత్రికి వచ్చారు.

పరీక్షలు చేసిన తర్వాత వైద్యులు ఆమెను గుండె జబ్బుల విభాగంలో చేర్చారు. ఆమెకు గుండెలోని కొంత భాగం కుంచించుకు పోతుందని తెలియడంతో గుండెకు సర్జరీ చేయాలని సిఫారసు చేశారు. ఈ సర్జరీ వల్ల ఆమె ప్రాణానికి ముప్పు ఉండటంతో మొదట కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

High risk heart surgery on pregnant woman successful

దీంతో ఆమెను ఆసుపత్రి నుంచి పంపించారు. కానీ సమస్య మరింత తీవ్రం కావడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రముఖ గుండె సర్జరీ నిపుణులు రాజ్ కుమార్ యాదవ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఫిబ్రవరి 18న ఆమెకు సర్జరీ నిర్వహించిదని, అత్యంత రిస్క్‌తో కూడిన ఈ ఆపరేషన్‌ని విజయ వంతంగా పూర్తి చేసిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరించారు.

ప్రస్తుతం ఆ గర్భిణి కోలుకుంటున్నారని, రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిస్తామని తెలిపారు.

English summary
A high risk open heart surgery was successfully operated upon on a seven-month pregnant woman at a government hospital here, officials said Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X