నేతాజీ ఫ్యామిలీకి ఆతిథ్యంపై మన్ కీ బాత్‌లో మోడీ
న్యూఢిల్లీ: అక్టోబర్ నెలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి తాను ఆతిథ్యం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. ప్రధాని మోడీ ఈ రోజు మన్ కీ బాత్‌లో మాట్లాడారు. ఇది పన్నెండవసారి.
ప్రజల శక్తి పైన తనకు ఎంతో నమ్మకముందని, ప్రజల సలహాలకు ప్రాధాన్యతనిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన్ కీ బాత్ ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉన్న ఆకాశవాణికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
చవకగా లభించే ఖద్దర్ దుస్తులను దేశ ప్రజలు ధరించాలని ఆయన కోరారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఖద్దర్ దుస్తుల కొనుగోళ్లు పెరిగాయని చెప్పారు. ఆధునికతను జోడించి ఖద్దర్ దుస్తులు తక్కువ ధరకు అందుబాటిలోకి వస్తాయన్నారు.

పర్యాటక రంగంలో భారత్‌కు చాలా అవకాశాలున్నాయని చెప్పారు. దేశంలో 30 లక్షల మంది తమ గ్యాస్ సబ్సిడీని స్వచ్చందంగా వదలుకున్నారని చెప్పారు. ధనికులు గ్యాస్ రాయితీని వదులుకోవడం ద్వారా పేదలకు చేయతనివ్వాలన్నారు.
ప్రజల సలహాలకు తాము ప్రాధాన్యతను ఇస్తామని ప్రధాని మోడీ చెప్పారు. సెల్ఫీ విత్ డాటర్ విజయవంతమైందన్నారు. ఈ యాప్ పైన ఇప్పటి వరకు 55వేల మంది స్పందించారని చెప్పారు. స్వచ్ఛ భారత్‌కు మరింత ప్రాధాన్యతనివ్వాలన్నారు. విమర్శలను తాను సానుకూలంగా తీసుకుంటానని చెప్పారు. ప్రజల శక్తికి వందనాలు అన్నారు.












Click it and Unblock the Notifications