Hijab Row: హిజాబ్ తలకు చుట్టుకుంటాము, బ్రైన్ కు కాదు, షాక్ ఇచ్చిన అమ్మాయి, మంత్రి మాత్రం !
బెంగళూరు: కర్ణాటకలో ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ మాత్రం హిజాబ్ అనే పదం చుట్టూనే తిరుగుతోంది. కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా కర్ణాటకలో జరుగుతున్న బుర్కాలు, కాషాయం కండువాల వివాదంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. హిజాబ్ వివాదం రానురాను రచ్చరచ్చ అవుతోంది. హిజాబ్ వివాదంతో కాషాయం కండువాలు తెరమీదకు రావడంతో గొడవ పెద్దది అయ్యింది. హిజాబ్, కాషాయం కండువాల గొడవలు పెద్దవి కావడంతో కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనలు మొదలైనాయి. మందుజాగ్రత్త చర్యగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలోని అన్ని విద్యాసంస్థల ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే హిజాబ్ ధరించి కాలేజ్ కు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని కొందరు ముస్లీం యువతులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన ఓ యువతి మేము హిజాబ్ తలకు చుట్టుకుంటామని, మెదడుకు కాదని, మా బ్రైన్ బాగానే పని చేస్తోందని గుర్తించాలని కర్ణాటక విద్యాశాఖా మంత్రికి చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

కథ దాని చుట్టూనే తిరుగుతోంది
కర్ణాటకలో ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ మాత్రం హిజాబ్ అనే పదం చుట్టూనే తిరుగుతోంది. కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా కర్ణాటకలో జరుగుతున్న బుర్కాలు, కాషాయం కండువాల వివాదంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. హిజాబ్ వివాదం రానురాను రచ్చరచ్చ అవుతోంది. హిజాబ్ వివాదంతో కాషాయం కండువాలు తెరమీదకు రావడంతో గొడవ పెద్దది అయ్యింది.

ఐటీ హబ్ లో పరిస్థితులు మారిపోయాయి
హిజాబ్, కాషాయం కండువాల గొడవలు పెద్దవి కావడంతో కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనలు మొదలైనాయి. మందుజాగ్రత్త చర్యగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలోని అన్ని విద్యాసంస్థల ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరు నగరంలో 14 రోజుల పాటు విద్యా సంస్థల చుట్టూ 144 సెక్షన్ విధించడమే కాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

విద్యాశాఖా మంత్రికి షాక్ ఇచ్చిన అమ్మాయి
ఇప్పటికే హిజాబ్ ధరించి కాలేజ్ కు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని కొందరు ముస్లీం యువతులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన హాజ్రా, శిఫా అనే యువతులు ఇండియా టుడే మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్బంగా ఓ యువతి మేము హిజాబ్ తలకు చుట్టుకుంటామని, మెదడుకు కాదని, మా బ్రైన్ బాగానే పని చేస్తోందని కర్ణాటక విద్యాశాఖా మంత్రి బిసి. నాగేష్ గుర్తించాలని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి
మేము హిజాబ్ (బుర్కాలు) వేసుకుని క్లాసులకు హాజరై చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన కాలేజ్ అమ్మాయిలు కర్ణాటక విద్యాశాఖా మంత్రి బిసి నాగేష్ కు మనవి చేశారు. రాజ్యంగంలో ఉన్న మా హక్కులను కాపాడాలని మాత్రమే మేము మనవి చేస్తున్నామని, మేము ప్రత్యేకంగా ఎలాంటి కోరికలు కోరలేదని ఆ అమ్మాయిలు కర్ణాటక విద్యాశాఖా మంత్రి బిసి. నాగేష్ కు చెప్పారు.

మంత్రి ఆరోపణలు ఇవే
కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు హిజాబ్ విషయంలో హైకోర్టును ఎలా ఆశ్రయించారు ? అనే విషయం అర్థం కావడంలేదని, కొందరు కాలేజ్ అమ్మాయిలను రెచ్చగొట్టి వారితో ఆందోళన చేయిస్తున్నారని అనుమానం ఉందని, వీరి వెనుక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, సోషియల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉందనే అనుమానం ఉందని, ఆ విషయంలో విచారణ జరుగుతోందని కర్ణాటక విద్యాశాఖా మంత్రి బిసి. నాగేష్ ఆరోపించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications