Hijab row:భజరంగ్‌దళ్ కార్యకర్త హత్య వ్యక్తిగత కక్షతోనేనా.. హిజాబ్ వ్యవహారంతో లింకేంటి..?

హిజాబ్ వివాదంతో కర్ణాటకలో ఇప్పటికే టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉండగా, సోమవారం అర్థరాత్రి 23 ఏళ్ల బజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురికావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్ణాటకలోని శివమొగ్గలో ఉద్రిక్తత నేపథ్యంలో విద్యాసంస్థలను మూసివేసి, ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. హత్యపై నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలను చెదరగొట్టేందుకు శివమొగ్గలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

Recommended Video

    Hijab Row: హిజాబ్ వివాదం Karnataka విద్యాసంస్థలకు సెలవు | Priyanka Gandhi | Oneindia Telugu

    'సోమవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించాలని డీసీని కోరామని శివమొగ్గ ఎస్పీ లక్ష్మీప్రసాద్ బీఎం తెలిపారు. ఊరేగింపు పూర్తయ్యాక అంతా ప్రశాంతంగా ఉందన్నారు.500 మందికి పైగా పోలీసులను మోహరించారు. బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష్ హత్యపై కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ.. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారని, విచారణ కొనసాగుతోందని అన్నారు.

    ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉన్నట్లు భావిస్తున్నామని, అయితే వీరి వెనుక ఎవరున్నారో ఇంకా తెలియరాలేదని జ్ఞానేంద్ర అన్నారు. హత్యకు గురైన బజరంగ్ దళ్ కార్యకర్త పేరు హర్ష అని అతని వయస్సు 26 సంవత్సరాలని మంత్రి చెప్పారు. హర్ష వృత్తిపరంగా టైలర్‌ అని చెప్పారు. ఇతన్ని కత్తితో పొడిచి హత్య చేశారని వివరించారు.

    Hijab row: Police investigate whether the killing of Bajrangdals worker was due to personal reasons

    పరిస్థితిని విశ్లేషించి శాంతిభద్రతలను కాపాడాలని పోలీసు అధికారులను ఆదేశించామని, 2-3 రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని కర్ణాటక హోం మంత్రి తెలిపారు. బజరంగ్ దళ్ కార్యకర్త హత్యపై బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా కర్ణాటక ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. జరిగిన ఘటనపై బీజేపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతోందని అయితే ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

    ప్రభుత్వం మాటలను ఇక నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కర్నాటక ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇదిలా ఉంటే కర్నాటకకు చెందిన కేంద్రమంత్రి శోభా కర్లాంజే జరిగిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ‌తో విచారణ చేయించాలని కోరుతూ సీఎం బసవరాజ్ బొమ్మయ్‌కు లేఖ రాశారు.

    అయితే ఈ హత్య వ్యక్తిగత కక్షలతోనే జరిగినట్లు తమవద్ద సమాచారం ఉందని కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు. ఇవే అంశాలను మీడియా కూడా రిపోర్ట్ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అయితే ఏం జరిగిందో ఇంకా తెలియదు కానీ వెంటనే విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించి మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని డీకే శివకుమార్ కోరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+