Hijab verdict: సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ముస్లీం అమ్మాయిలు, హిజాబ్, చదువు రెండు కావాలి !

బెంగళూరు/న్యూఢిల్లీ: ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ వేసుకుని అడుగు పెట్టకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొంతకాలం క్రితం కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం (మార్చి 15వ తేదీ) ఉదయం హిజాబ్ లు దరించే విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థల్లోకి వస్తామని ముస్లీం అమ్మాయిలు చెప్పడం సరికదాని, హిజాబ్ లు వేసుకుంటామని పట్టుపట్టకూడదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ప్రతివిద్యార్థి కచ్చితంగా పాటించాలని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ముస్లీం అమ్మాయిలు మంగళవారం మద్యాహ్నం మీడియాకు చెప్పారు. హిజాబ్ విషయంలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక ముస్లీం అమ్మాయిలు మంగళవారమే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యడంతో హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంట్లోనే ముస్లీం అమ్మాయిల తరుపు న్యాయవాది సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు

హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు

హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థలో అడుగు పెట్టకూడదని ఉడిపిలో కాలేజ్ ప్రిన్సిపాల్ తీసుకున్న నిర్ణయంపై కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ వేసుకుని అడుగు పెట్టకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని రోజుల పాటు కర్ణాటక హైకోర్టులో వాడివేడిగా హిజాబ్ వివాదం వాదనలు, ప్రతివాదనలు జరిగాయి.

హైకోర్టు తీర్పుతో షాక్ అయ్యాము

హైకోర్టు తీర్పుతో షాక్ అయ్యాము

ఇస్లాం మతంలో హిజాబ్ అనేది ఒక భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థల్లో వస్తామని ముస్లీం అమ్మాయిలు చెప్పడం సరికదాని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హిజాబ్ లు వేసుకోవాలని పట్టుపట్టకూడదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పును మేము గౌరవిస్తామని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ముస్లీం అమ్మాయిలు అన్నారు.

ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అమ్మాయిలు

ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అమ్మాయిలు


కర్ణాటక హైకోర్టు తీర్పుతో మేమే షాక్ అయ్యామని, మాకు న్యాయం జరగలేదు అనిపిస్తోందని కొందరు ముస్లీం అమ్మాయిలు అన్నారు. మంగళవారం ఉడిపి ప్రెస్ క్లబ్ లో ముస్లీం అమ్మాయిలు ఆల్మాస్, ఆలియా ఆసాది తదితరులు మీడియాలో మాట్లాడారు. మేము మా లాయర్లతో చర్చించి హైకోర్టు తీర్పును సవాలు చెయ్యాలా ? వద్దా ? అనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఆల్మాస్, ఆలియా ఆసాది తదితరులు మీడియాకు చెప్పారు. అయితే కొన్ని గంటల్లోనే ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టును ఆశ్రయించడం మరోసారి హిజాబ్ వివాదం మొదలైయ్యింది.

మాకు హిజాబ్ కావాలి, విద్య కూడా కావాలి

మాకు హిజాబ్ కావాలి, విద్య కూడా కావాలి


హిజాబ్ వేసుకోవడం మా మతం ఆచారం అని ముస్లీం అమ్మాయిలు అంటున్నారు. మాకు విద్యతో పాటు హిజాబ్ లు వేసుకోవడం ముఖ్యమని, మాకు రెండు కావాలని ముస్లీం అమ్మాయిలు అంటున్నారు. కొన్ని వేల మంది ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వెలుతామని, పరీక్షలు రాస్తామని అంటున్నారని ఇదే సమయంలో అమ్మాయిలు చెప్పారు. ఇదే సమయంలో కర్ణాటకకు చెందిన నిబా నాజ్ అనే అమ్మాయి తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కొందరు ముస్లీం అమ్మాయిలు ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+