ఆ సీఎంను అరెస్టు చేస్తాం: సుప్రీం కోర్టులో సీబీఐ
న్యూఢిల్లీ: అక్రమాస్తులు సంపాధించిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో సీబీఐ అధికారులు పిటీషన్ వేశారు.
సీబీఐ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని ధర్మాసనం దసరా తరువాత విచారణ చేపడతామని పేర్కోంది. ఈ ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి అరుణ్ మిశ్రా ఈ విషయంపై ఇలా వ్యాఖ్యానించారు.

ఈ పిటీషన్ ను అత్యవసరంగా విచారణ చేపట్టే అంశంగా తాము భావించడం లేదని, వెంటనే వాదోపవాదాలు ప్రారంభించలేమని అన్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగ అయ్యే వరకు వేచి చూడాలని సీబీఐ భావించింది.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యులు అక్రమాస్తులు సంపాదించారని సీబీఐ కేసు నమోదు చేసింది. తనతో పాటు కుటుంబ సభ్యులను అరెస్టు చెయ్యకుండా వీరభద్ర సింగ్ ఆ రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించారు.
వీరభద్ర సింగ్, ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చెయ్యరాదని హియమాచల్ ప్రదేశ్ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications