హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కన్నుమూత, ప్రముఖుల నివాళి
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్(87) కన్నుమూశారు. వీరభద్ర సింగ్ దీర్ఘకాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
Himachal Pradesh | Former Himachal Pradesh Chief Minister & Congress leader Virbhadra Singh passes away at 87 after battling with prolonged illness in early hours of the day: Medical Superintendent Dr Janak Raj, Indira Gandhi Medical College and Hospital, Shimla
— ANI (@ANI) July 7, 2021
(File pic) pic.twitter.com/xPnGrpYfSI
వీరభద్ర సింగ్ గత కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున మరణించారని ఆస్పత్రి సూపరింటెండెంట్ జనక్ రాజ్ మీడియాకు వెల్లడించారు. వీరభద్రసింగ్ రెండుసార్లు కరోనా బారినపడి కోలుకున్నారని తెలిపారు. అయితే, గత కొన్ని రోజులుగా వీరభద్ర సింగ్ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్నారని చెప్పారు.

Recommended Video
కాగా, 1934 జూన్ 23న సిమ్లాలో జన్మించిన వీరభద్రసింగ్.. హిమాచల్‌ప్రదేశ్‌కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాల్లో బలమైన ముద్రవేసిన ఆయన.. 9 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికవడం విశేషం.
ప్రస్తుతం ఆయన సోలన్ జిల్లాలోని ఆర్కీ ఎమ్మెల్యేగా ఉన్నారు. చివరిసారిగా 2012-2017 వరకు సీఎంగా పనిచేశారు.
వీరభద్ర సింగ్ మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications