ఫోన్‌లో ఫోటో దిగితే చాలు.. వెంటనే రేషన్ అందజేత.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

పేద, మధ్య తరగతి ప్రజల కోసం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఈ లెక్కన దేశంలో కోట్ల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే సాధారణంగా మనం రేషన్ షాప్ కు వెళ్లి మన దగ్గర ఉన్నరేషన్ కార్డుతో మ్యానువల్ గా రాయించుకొని లైనులో నిలబడి రేషన్ తీసుకుంటాం. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ పాస్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.

ఈ పాస్ యంత్రాల్లో ఫింగర్‌ ప్రింట్‌ లేదా, ఐరిస్‌ స్కాన్‌ ద్వారా బయోమెట్రిక్ పూర్తిచేసి రేషన్ తీసుకుంటున్నారు. అయితే ఈ యంత్రాల్లో నెట్‌ వర్క్‌ సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో టెక్నాలజీ ఫేస్ అథెంటికేషన్​ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధానం ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా రేషన్ దుకాణాల్లో వినియోగదారుల ముఖాన్ని స్కాన్ చేసి వారికి రేషన్ అందజేస్తున్నారు.

Himachal Pradesh Pioneers Instant Ration Distribution with Mobile Face Authentication

సరికొత్త సాంకేతిక విధానం ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఒక్క ఫోటో దిగితే చాలు రేషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కొత్త టెక్నాలజీని హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం విజయవంతంగా అమలు చేస్తోంది. అంతేకాక ఈ వ్యవస్థను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగానూ హిమాచల్ ప్రదేశ్​ నిలిచింది. మొన్నటి వరకూ ఇతర రాష్ట్రాల మాదిరిగానే హిమాచల్ లోనూ ఈ పాస్‌ యంత్రం ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ కొనసాగేది.

అయితే గత కొద్దికాలంగా ఈ యంత్రాల్లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రజలు గంటల తరబడి రేషన్ షాపుల వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఈ మేరకు ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ సమస్యపై దృష్టిపెట్టింది హిమాచల్ ప్రభుత్వం. అందులో భాగంగానే ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల రేషన్ డీలర్లు ఈ కొత్త టెక్నాలజీని అమలు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక రేషన్‌ దుకాణాలలో ఈ టెక్నాలజీని వినియోగించి రేషన్ పంపిణీ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+