ఈ హోటల్ ఇంక ప్రభుత్వానికే. 30 ఏళ్ల పోరాటం ముగిసింది, రూ.400 కోట్లు చేతికందింది

సిమ్లా మంచు కొండల్లో అత్యంత విలాసవంతమైన పేరున్న "వైల్డ్‌ఫ్లవర్ హాల్ హోటల్" ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి సరికొత్త ఆదాయ వనరుగా మారింది. గత మూడు దశాబ్దాలుగా కోర్టు వివాదాల్లో నలిగిపోయిన ఈ అత్యంత విలువైన ఆస్తిపై రాష్ట్ర ప్రభుత్వం పట్టు సాధించింది. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని ప్రభుత్వం... న్యాయస్థానాల్లో గట్టిగా పోరాడి విజయం సాధించడమే కాకుండా, ఇప్పుడు ఆ హోటల్ నిర్వహణ హక్కులను ఈ-వేలం ద్వారా దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయం ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల ప్రయోజనాన్ని తెచ్చిపెట్టబోతోంది.

వైల్డ్‌ఫ్లవర్ హాల్ హోటల్ ఆపరేషన్, మేనేజ్‌మెంట్ లైసెన్స్ హక్కుల కోసం ప్రభుత్వం తాజాగా నిర్వహించిన ఈ-వేలానికి ఊహించని స్పందన లభించింది. హోటల్ వార్షిక స్థూల ఆదాయంలో ఏకంగా 47.1 శాతాన్ని ప్రభుత్వానికి వాటాగా ఇచ్చేందుకు బిడ్డర్లు ముందుకు వచ్చారు. ఇప్పటివరకు జరిగిన హోటల్ వేలాల్లో ఇది ఒక రికార్డు స్థాయి బిడ్ అని స్వయంగా ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి ఏమాత్రం గండి పడకుండా ఈ రికార్డు స్థాయి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

Himachal Pradesh Wins 30-Year Legal Battle Earns Rs 400 Crore Cash From Wildflower Hall Hotel

నెలకు రూ. 3 కోట్లు.. 35 ఏళ్లలో రూ. 2000 కోట్ల ఆదాయం!

ఈ 35 ఏళ్ల లైసెన్స్ కాల పరిమితి ఒప్పందం ద్వారా ప్రతి నెలా ప్రభుత్వానికి సుమారు రూ. 3 కోట్ల రాబడి రానుంది. అంతేకాకుండా, ప్రతి ఏటా ఈ రాబడిపై 3 శాతం పెంపు ఉంటుంది. ఇలా 35 ఏళ్ల కాలంలో మొత్తంగా దాదాపు రూ. 2,000 కోట్ల భారీ ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరనుందని అంచనా వేస్తున్నారు. దీనికి అదనంగా, లైసెన్స్ దక్కించుకున్న సంస్థ ముందస్తుగానే రూ. 24 కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించడంతో పాటు, హోటల్ అభివృద్ధికి కనీసం రూ. 50 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది.

30 సెకన్లలోనే ప్రళయ సంకేతం.. హిమాలయాల్లో బిగ్ టెక్నాలజీ ఎంట్రీ!
30 సెకన్లలోనే ప్రళయ సంకేతం.. హిమాలయాల్లో బిగ్ టెక్నాలజీ ఎంట్రీ!

చేతికందిన రూ. 400 కోట్ల నగదు!

న్యాయపోరాటంలో సాధించిన విజయం ఫలితంగా మషోబ్రా రిసార్ట్స్ లిమిటెడ్ (JVC) బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ. 320 కోట్లతో పాటు, ఆర్బిట్రేషన్ అవార్డు ద్వారా రావలసిన మరో రూ. 25 కోట్లు, మొత్తంగా దాదాపు రూ. 400 కోట్లు నగదు రూపంలో రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి జమ అయ్యాయి. ఈ చర్యతో జాయింట్ వెంచర్ కంపెనీ పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి వచ్చి, హోటల్ ల్యాండ్, ప్రాపర్టీ, దానికి సంబంధించిన అన్ని రకాల ఆస్తులపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి యాజమాన్య హక్కులు దక్కాయి.

ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ టాయిలెట్ల్స్.. ఎక్కడున్నాయో తెలుసా?
ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ టాయిలెట్ల్స్.. ఎక్కడున్నాయో తెలుసా?

ప్రజా ప్రయోజనాలకే మా మొదటి ప్రాధాన్యం!

గతంలో ఈ లగ్జరీ ప్రాపర్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం దక్కేది కాదు. అయితే సుప్రీంకోర్టుతో పాటు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో దేశంలోనే ప్రముఖ న్యాయవాదుల సాయంతో ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్చి 31న ఈ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించి, ఆస్తిని కాపాడుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+