రెండో టాపర్ ఖాన్‌ను పెళ్లాడతానని ఐఏఎస్ టాపర్ యువతి: హిందూ మహాసభ లేఖ

Posted By:
Subscribe to Oneindia Telugu

మీరట్: అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు యూపీఎస్సీ టాపర్ టినా దాబి కుటుంబ సభ్యులకు ఓ లేఖ రాశారు. ఆమె యూపీఎస్సీ రెండో టాపర్ అతర్ అమీర్ ఉల్ షఫీ ఖాన్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో హిందూ మహాసభ సభ్యులు ఆమె తల్లిదండ్రులకు లేఖ రాశారు.

టినా దాబి 2015లో యూపీఎస్సీ టాపర్. అతర్ అమీర్ ఉల్ షపీ ఖాన్ రెండో టాపర్‌గా నిలిచారు. ఇప్పుడు టినా దాబి సెకండ్ టాపర్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో హిందూమహాసభ సభ్యులు టినా దాబి తల్లిదండ్రులకు లేఖ రాశారు.

ఈ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల పెళ్లిని నిలుపుదల చేయాలని టినా దాబి తల్లిదండ్రులకు రాసిన లేఖలో హిందూ మహాసభ సూచించింది. లేదంటే కనీసం షఫీ ఖాన్‌ను మన మతంలోకి మార్పించాలని కోరింది. లేదంటే ఇది కూడా ఓ లవ్ జిహాద్ అని అభిప్రాయపడ్డారు.

Hindu Mahasabha irked at IAS topper's wedding

మీ కుటుంబ సభ్యుల నిర్ణయం లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందని, అలా చేయవద్దని, లవ్ జిహాద్‌ను ప్రోత్సహించకూడదంటే ఈ పెళ్లి జరగకూడదని హిందూమహాసభ అభిప్రాయపడింది.

ఒకవేళ ఇప్పటికీ వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటే అతను హిందువుగా మారాలని, అతను అందుకు అంగీకరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అతను తిరిగి హిందూమతంలోకి రావాలన్నా లేక ఘర్ వాపసీ కోసమైనా తమ సభ్యులు సహకరిస్తారని తెలిపారు.

టినా దాబి తండ్రి జస్వంత్ దాబికి రాసిన లేఖలో ఇంకా.. టినా దాబి యూపీఎస్సీ 2015లో టాపర్‌గా నిలవడం పట్ల మేమంతా చాలా సంతోషించామని, కానీ ఆమె ఖాన్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో షాకయ్యామని పేర్కొన్నారు.

మీకు ఓ విషయం చెప్పదలుచుకున్నామని, ముస్లీం యువకులు హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ద్వారా లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారని, ముఖ్యంగా హిందువులలో హై లెవల్లో ఉన్న అమ్మాయిల పైన కూడా లవ్ జిహాద్ ప్రయోగిస్తున్నారని, ఆ తర్వాత ఆ హిందు యువతులను ముస్లీంలుగా మారుస్తున్నారని అందులో తెలిపారు. పెళ్లి ఇద్దరికి ముఖ్యమైతే ఖాన్ ఘర్ వాసపీ లేదా తిరిగి హిందుత్వంలోకి రావాలన్నారు. కాగా, టినా దాబి ఇటీవల ఫేస్‌బుక్ ద్వారా తాను అతర్ ఖాన్‌ను పెళ్లాడనున్నట్లు వెల్లడించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Akhil Bharatiya Hindu Mahasabha members have written a letter to 2015 UPSC topper Tina Dabi's parents after she recently announced she will marry the second rank holder, Athar Aamir-ul Shafi Khan. Mahasabha has asked the IAS officer's parents to cancel the wedding or at least convince Khan to get converted.
Please Wait while comments are loading...