వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యపై హిందూ-ముస్లీం నేతల చర్చలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: అయోధ్య రామ మందిరం అంశంపై హిందూ, ముస్లీం నాయకులు చర్చలకు ముందుకు వచ్చారు. ఇరు వర్గాల నేతలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు అంగీకరించారు. అయోధ్య - బాబ్రీ మసీదు అంశానికి శాంతియుత పరిష్కారం కావాలని వారు ఈ సందర్భంగా కోరుకున్నారు.

ఆలిండియా అఖాడా పరిషత్ నూతన అధ్యక్షులు మహంత్ నరేంద్ర గిరి మంగళవారం నాడు బాబ్రీ మసీదు కేసులో వృద్ధ నేత హషీం అన్సారీతో భేటీ అయ్యారు. మహంత్ నరేంద్ర గిరితో పాటు కొందరు మహంతులు, సాధువులు కూడా ఉన్నారు.

Hindu, Muslim leaders meet for settlement of Ayodhya dispute

వీరి మధ్య చర్చలు దాదాపు అరగంటపాటు జరిగాయి. ఈ సందర్భంగా మహంత్ నరేంద్ర గిరి మాట్లాడుతూ... ఈ వివాదం చర్చల ద్వారా పరిష్కారమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. పరిష్కారం దిశగా తప్పనిసరిగా హిందువులకు, ముస్లీంలకు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు.

సుప్రీం కోర్టు ఈ కేసుపై రోజువారీ విచారణ జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అన్సారీ మాట్లాడుతూ.. చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమని చెప్పారు. ఇరు మతాల వారు సంతోషించే విధంగా శాంతియుత పరిష్కారం కనుగొనాల్సి ఉందని చెప్పారు.

English summary
Hindu and Muslim leaders have met for a negotiated settlement of the Babri Masjid-Ram Janmabhoomi dispute with both sides saying a peaceful way to resolve the issue must be found.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X