చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.లక్ష తీసుకొని దేశం విడిచి వెళ్లండి: జడ్జికి చెక్కు

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: వివాదాస్పద మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్‌కు హిందుత్వ సంస్థ ఒకటి రూ.లక్ష చెక్కును పంపించి దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. ఇటీవల తన బదిలీపై తానే స్వయంగా స్టే విధించుకుని, సుప్రీం కోర్టునే కర్ణన్ ప్రశ్నించారు.

దీనిపై హిందూ సంస్థ ఒకటి అతనికి లక్ష రూపాయల చెక్కును పంపించి, దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించింది. తమిళనాడులో రిజిస్టరయిన హిందూ మక్కల్ కట్చి అనే సంస్థ తాము కర్ణన్ ను వేరే ఏదైనా దేశానికి వెళ్లాలని కోరినట్టు తెలిపింది.

Hindu outfit wants controversial judge out of the country, sends him cheque of Rs 1 lakh

ఇందుకోసం లక్ష రూపాయల చెక్కును పంపామని హిందూ మక్కల్ కట్చి అధ్యక్షులు అర్జున్ సంపత్ తెలిపారు. ఆయన భారత రాజ్యాంగాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందునే ఇలా చేశామన్నారు. కర్ణన్ తమ చెక్కును క్యాష్ చేసుకుంటే, తాను ఏ దేశానికి వెళుతున్నానన్న విషయం తమకు చెబితే చాలని, ఇంకేమీ అడగబోమన్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. వివక్ష కనిపిస్తోందని, ఇలాగైతే తాను దేశం విడిచి వెళ్తానని వ్యాఖ్యానించారు.

English summary
A local Hindu outfit in Coimbatore has condemned controversial Madras High Court judge Justice C S Karnan for his outbursts against the judiciary and claimed to have sent him a letter and a Rs 1 lakh cheque, requesting him to leave the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X