సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు: ఇది హిందుత్వ కాదంటూ ప్రశ్న
న్యూఢిల్లీ: హిందుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు, రచనలతో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్‌పై ఇప్పటికే నలుమూలాల నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం ఉత్తరాఖండ్ నైనిటాల్‌లోని సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి కొంతమంది నిప్పంటించారు.
ఈ వివరాలను సల్మాన్ ఖుర్షీద్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ఇంట్లో మంటల దృశ్యాలు, కాలిపోయిన తలుపులు, పగిలిన కిటికీల అద్దాల ఫొటోలు, వీడియోలనూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసి పలు వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో.. అలాంటి స్నేహితులతో చర్చల కోసం ఈ ఇంటి తలుపులు తెరవాలని ఆశించానని, ఇది హిందూయిజం కాదని నేను చెప్పింది తప్పంటారా? అని వ్యాఖ్యానించారు.

కాగా, సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి చేసిన వ్యవహారంలో 20 మందిపై కేసు నమోదు చేసినట్లు డీజీఐ నీలేష్ ఆనంద్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయోధ్య కేంద్ర బిందువుగా సల్మాన్ ఖుర్షీద్ తాజా పుస్తకం 'సన్‌రైజ్ ఓవర్ అయోధ్య.. నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్' వివాదాస్పదమైన విషయం తెలిసిందే. హిందుత్వాన్ని తీవ్రవాద ఇస్లామిక్ సంస్థలతో పోల్చి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ, ఇతర సంస్థలు నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
— Salman Khurshid (@salman7khurshid) November 15, 2021
Recommended Video
ఇది ఇలావుండగా, ఖుర్షీద్ ఇంటిపై దాడి ఘటనను మరో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీవ్రంగా ఖండించారు. ఇది అవమానకరం. మన రాజకీయాల్లో పెరుగుతున్న అసహనం స్థాయిలను అధికారంలో ఉన్నవారు ఖండించాలి అని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. దేశం పట్ల తనకున్న విజన్‌ను గర్వించదగ్గ రీతిలో అంతర్జాతీయ వేదికలపైనా చాటిన రాజనీతిజ్ఞుడు సల్మాన్ ఖుర్షీద్ అని ప్రశంసించారు. కాగా, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా దాడి ఘటనను తీవ్రంగా మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications