ఎమ్మెల్యే అభ్యర్థి భార్యను అదుపులోకి తీసుకున్న ఐటీ అధికారులు, ఏం జరిగింది ?
బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలు కావడానికి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే బహిరంగ ప్రచారానికి తెరపడటంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్న జేడీఎస్ పార్టీ లీడర్ భార్యను ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.
బుధవారం కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ మొదలౌతుంది. మంగళవారం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని హిరియూరులోని జేడీఎస్ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేస్తున్న రవీంద్రప్ప భార్య జి.పి. లతాను మంగళవారం ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

హిరియూరు తాలుకాలోని ధర్మపుర సమీపంలోపి ముంగుసుహళ్లి గ్రామంలో రవీంద్రప్ప నివాసం ఉంటున్నారు. మంగళవారం ఐటీ శాఖ అధికారులు జేడీఎస్ పార్టీ అభ్యర్థి రవీంద్రప్ప ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రవీంద్రప్పతో పాటు ఆయన కుమారుడు సత్యనారాయణ ఇంటింటి ప్రచారం చెయ్యడానికి వెళ్లారు. ఇంట్లో జేడీఎస్ లీడర్ రవీంద్రప్ప భార్య లతా మాత్రమే ఉన్నారు.
జేడీఎస్ లీడర్ రవీంద్రప్ప ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య లతాను అదుపులోకి తీసుకున్న ఆరు మంది ఐటీ శాఖ అధికారులు ఆమెను ప్రత్యేక వాహనంలో బెంగళూరుకు పిలుచుకుని వెళ్లారు. ఏప్రిల్ 21వ తేదీన 20 మంది ఐటీ శాఖ అధికారులు రవీంద్రప్ప ఇంటి మీద, ముంగుసుహళ్లిలోని ఆయన ఫామ్ హౌస్ మీద దాడులు చేశారు.
ఆ సమయంలో రవీంద్రప్ప, ఆయన కుటుంబ సభ్యులు, ఫామ్ హౌస్ లో పని చేస్తున్న కూలీలను విచారణ చేశారు. రవీంద్రప్ప సమీప బంధువు నాగరాజ్ ఇంటిలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. తరువాత విచారణకు హాజరుకావాలని ఐటీ శాఖ అధికారులు విచారణకు హాజరుకావాలని జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర భార్య లతాకు నోటీసులు ఇచ్చారు.
అయితే లతా ఇంత వరకు ఐటీ శాఖ అధికారుల ముందు విచారణకు హాజరుకాలేదు. లతాను విచారణకు రావాలని సూచించినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని తెలిసింది. ఇంజనీర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న రవీంద్రప్ప రిటైడ్ అయిన తరువాత హిరియూరు జేడీఎస్ పార్టీ టిక్కెట్ మీద అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
అయితే హిరియూరులో బీజేపీ అభ్యర్థి ఓడిపోతారని తెలుసుకుకుని పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రజల్లో మంచి పేరు ఉన్న జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రప్ప ఇంటి మీద ఐటీ దాడులు జరగడం, ఆయన భార్య లతాను అధికారులు అదుపులోకి తీసుకోవడంతో జేడీఎస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications