యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బిగ్ షాక్ ఇచ్చిన కోర్టు.. తిక్క కుదిరింది..!

భారత్ లో ఉంటూ పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తూ గూఢచర్యానికి పాల్పడిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది హిసార్ కోర్టు. పాకిస్థాన్ గూఢచర్యానికి పాల్పడ్డ కేసుపై తాజాగా హరియాణా కోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ హరియాణాలోని హిసార్ కోర్టు తీర్పును వెలువరించింది. ట్రావెల్ విత్ జో పేరుతో ఓ ఛానల్ నడుపుతూ ఆమె పాకిస్థాన్ కు ఇక్కడి సమాచారాన్ని చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది హిసార్ కోర్టు. పాకిస్థాన్ కు గూఢచర్యానికి పాల్పడిన కేసులో ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అంతకుముందు నాలుగు రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఆమెను విచారించిన పోలీసులు.. మరింత సమాచారాన్ని రాబట్టడం కోసం జ్యోతికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఇక ఇప్పటికే పాకిస్థాన్ కు గూఢచర్యం చేసిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లంతా పాక్ నుంచి డబ్బు తీసుకుని ఇక్కడి రహస్య సమాచారాన్ని.. పోలీసులు, అధికారుల కదలికలను ఎప్పటికప్పుడు పాకిస్థాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు.

ఇక జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె పాకిస్థాన్ వెళ్లినప్పుడు అక్కడి ప్రభుత్వం జ్యోతికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పినట్లు.. రాచ మర్యాదలు చేసినట్లు తేలింది. ఆరుగురు గన్ మెన్స్ తో ఆమెకు ఫుల్ సెక్యూరిటీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏకే 47 రైఫిల్స్ తో జ్యోతి మల్హోత్రాకు భద్రత కల్పించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Hisar Court Sends YouTuber Jyoti Malhotra to 14 Days Judicial Custody

మరోవైపు గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరొక సారి పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మన సోదరీమణుల నుదిట సింధూరాన్ని తుడిచేసే ధైర్యం చేసిన వాళ్లను ఖతం చేశామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో త్రివిధ దళాలకు పూర్తిస్థాయి స్వేచ్ఛను ఇచ్చామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+