అయోధ్య రామమందిరంపై ఎగిరిన 11 కేజీల కాషాయ జెండా- ఎన్నో ప్రత్యేకతలు

చారిత్రాత్మక అయోధ్య రామమందిరంపై కాషాయ జెండా ఎగిరింది..రెపరెపలాడింది. ఇది- ఆలయ నిర్మాణం సంపూర్ణం అయిందనడానికి గుర్తు. ధ్వజారోహణ ఘట్టంతో ఆలయ నిర్మాణానికి అధికారికంగా ముగింపు పలికినట్టయింది. ధ్వజారోహణ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పూర్తయింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కొద్దిసేపటి కిందటే అయోధ్యలో గల రామమందిరం శిఖరంపై మోదీ కాషాయ జెండాను ఎగురవేశారు. 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో కుడి కోణం త్రిభుజాకారంలో ఉండే కాషాయ పతాకం ఇది. దీని బరువు 11 కేజీలు. శ్రీరాముడి తేజస్సు, శౌర్యాన్ని ప్రతిబింబించే ప్రకాశవంతమైన సూర్యుడి చిత్రాన్ని ముద్రించారు. జెండాపై 'ఓం' గుర్తు, కోవిదార వృక్షాన్ని చిత్రీకరించారు. ఈ పవిత్ర కాషాయ జెండా.. రామరాజ్య ఆదర్శాలకు గుర్తుగా, దేశ సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టింది.

Historic Dhwajarohan Ceremony Modi Hoists Saffron Flag at Shri Ram Mandir in Ayodhya

రామమందిర శిఖరంపై 42 అడుగుల ఎత్తు ఉన్న స్తంభంపై ఈ పతాకాన్ని ఎగురవేశారు. 'అభిజీత్ ముహూర్తం'లో ఈ కార్యక్రమం పూర్తయింది. పవిత్ర కార్యాలకు ఇది అత్యంత శుభప్రదమైన ముహూర్తంగా భావిస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధువులు, పలువురు ప్రముఖులు, రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని 44 ద్వారాలు కూడా పూజల కోసం తెరుచుకున్నాయి.

కాషాయ జెండాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీరాముడు సూర్యవంశానికి చెందినందు వల్ల జెండాపై బంగారు వర్ణంలో మెరిసిపోయేలా సూర్యభగవానుడిని చిత్రీకరించారు. ఓం.. అనే అక్షరం దేశ ఆధ్యాత్మికతను ప్రతిధ్వనింపజేసేంది. వాల్మీకి రామాయణంలో వర్ణించిన కోవిదార్ వృక్షం.. ఆలయ పవిత్రత, సమాజ శ్రేయస్సు, రామరాజ్య స్థాపనకు చిహ్నాలుగా నిలిచాయి. ఈ జెండాను అహ్మదాబాద్‌లోని ఒక పారాచూట్ తయారీ సంస్థ 25 రోజుల్లో రూపొందించింది.

సూర్యరశ్మి, వర్షం, బలమైన గాలులను తట్టుకునేలా పారాచూట్-గ్రేడ్ ఫాబ్రిక్, ప్రీమియం సిల్క్ దారాలను ఉపయోగించారు. 11 కిలోల బరువున్న ఈ జెండా స్పెసిఫికేషన్లను ఆర్మీ సీనియర్ అధికారులతో సంప్రదించి ఖరారు చేశారు. జెండా ఎగురవేసే కార్యక్రమం శ్రీరాముడు- సీతాదేవిల వివాహ దినోత్సవమైన వివాహ పంచమి రోజున జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోడీ ఆలయ ప్రాంగణంలోని నూతనంగా నిర్మించిన సప్త మందిరంలో పూజలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+