చరిత్ర సృష్టించిన రాజస్థాన్ అమ్మాయి
రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ చరిత్ర సృష్టించారు. మిస్ యూనివర్స్ ఇండియా 2025గా ఎన్నికయ్యారు. జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో విజేతగా నిలిచారు. 2024 మిస్ యూనివర్స్ ఇండియా.. రియా సింఘా ఆమెకు కిరీటాన్ని అలంకరించారు.
మణిక విశ్వకర్మ.. ఈ ఏడాది నవంబర్‌లో థాయ్ లాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ కు ప్రాతినిథ్యాన్ని వహించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన తాన్య శర్మ ఫస్ట్ రన్నరప్‌గా, మెహక్ ధింగ్రా సెకెండ్ రన్నరప్‌గా, హర్యానా అమ్మాయి అమిషి కౌశిక్ మూడో రన్నరప్‌గా నిలిచారు.

ఆమె స్వస్థలం.. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్. ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తోన్నారు. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నారు. మణిక.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారిణి. క్లాసికల్ డాన్సర్. చిత్రలేఖనంలో ఆమెకు ప్రావీణ్యం ఉంది. గత ఏడాది మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన బిమ్స్ టెక్ సెవోకాన్‌లో భారత్ ప్రాతినిథ్యాన్ని సైతం వహించారు. న్యూరోనోవా అనే సంస్థను మణికా విశ్వకర్మ స్థాపించారు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ వంటి న్యూరోలాజికల్ సమస్యతో బాధపడే వాళ్లకు సేవలను అందిస్తుంది.
మిస్ యూనివర్స్ లో ఇప్పటికే భారత్ మూడు టైటిళ్లను అందుకున్న విషయం తెలిసిందే. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్ సంధూ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించారు. ఈ ఏడాది నవంబర్ లో థాయ్ లాండ్ లో ఈ ఏడాది మిస్ యూనివర్స్ కాంపిటీషన్ జరుగనుంది.
దీనికి భారత్ తరఫున ప్రాతినిథ్యాన్ని వహించనున్నారు మణిక విశ్వకర్మ. గత ఏడాది భారత్ తరఫున రియా సింఘా ఇందులో పాల్గొన్నారు గానీ నిరాశపరిచారు. టాప్ 12లో కూడా చోటు దక్కించుకోలేకపోయారు. డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కేజర్ ఈ టైటిల్ సాధించారు. డెన్మార్క్ నుంచి ఈ ఘనత సాధించిన మొదటి యువతిగా రికార్డు నెలకొల్పారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications