Video: తగలబడిన హిట్లర్ కోట.. మంచు పర్వతంపై బుగ్గిపాలైన నాజీల ఆనవాళ్లు!

రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి చారిత్రక అవశేషం, నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ రహస్య సమావేశాల నిలయం 'ఈగిల్స్ నెస్ట్' (కెహ్ల్‌స్టెయిన్‌హాస్) అగ్నిప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైంది. జర్మనీలోని బావేరియన్ పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తైన కొండశిఖరంపై ఉన్న ఈ చారిత్రక భవనం శుక్రవారం రాత్రి ఒక్కసారిగా అగ్నికీలల్లో చిక్కుకుంది. దాదాపు 1,834 మీటర్ల (6,000 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ భవనంలో మంటలు ఆకాశాన్నంటాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రమాదంలో భవనం అత్యధిక భాగం కాలిబూడిదైందని, దాన్ని మళ్లీ యథాతథంగా పునరుద్ధరించడం దాదాపు అసాధ్యమని అధికారులు వెల్లడించారు.

శుక్రవారం రాత్రి 9:15 గంటల ప్రాంతంలో ఈగిల్స్ నెస్ట్ భవనంలో స్మోక్ డిటెక్టర్ ద్వారా అగ్నిప్రమాద హెచ్చరిక వెలువడింది. సమాచారం అందుకున్న ఆరు మున్సిపాలిటీలకు చెందిన దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది, మౌంటెన్ రెస్క్యూ టీమ్స్, పోలీసులు అత్యవసరంగా కొండపైకి చేరుకున్నారు. కానీ, అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉండటం, వీచే ఈదురుగాలులు, రాత్రి వేళ కురిసిన వర్షం మంచుగా మారడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఆక్సిజన్ మిషన్స్ సహాయంతో సిబ్బంది రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.

Hitler Eagle s Nest Fire Historic Nazi Mountain Retreat Destroyed in Bavaria German Suspect Arrested

ఇది ప్రమాదమా? కుట్ర పూరిత చర్యనా?..

ఈ భయంకరమైన అగ్నిప్రమాదానికి గల కారణాలపై జర్మనీ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇది ఎవరో కావాలని చేసిన కుట్ర కావచ్చుననే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా 33 ఏళ్ల జర్మన్ పౌరుడిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎవరూ చిక్కుకోలేదని, భవనంలోకి వెళ్లే ప్రధాన రహదారులను పూర్తిగా మూసివేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జర్మన్ పోలీసు అధికార ప్రతినిధి లీసా మేయర్ మీడియాకు తెలిపారు.

హిట్లర్ తన మేనకోడలినే చంపేశాడా? 95 ఏళ్ల తర్వాత తెరపైకి రహస్యం!
హిట్లర్ తన మేనకోడలినే చంపేశాడా? 95 ఏళ్ల తర్వాత తెరపైకి రహస్యం!

ఇంజనీరింగ్ అద్భుతం.. నాజీల చీకటి చరిత్రకు సాక్ష్యం!

నాజీ పాలనలో అత్యంత కీలకమైన భవనాల్లో ఈ 'ఈగిల్స్ నెస్ట్' ఒకటి. 1939లో హిట్లర్ పుట్టినరోజు కానుకగా నాజీ వర్గాలు దీనిని నిర్మించి అందించాయి. కొండలను తొలిచి చేసిన రహదారి ద్వారా కొండ గుండెల్లోకి వెళ్లి, అక్కడ కొండ లోపలి నుంచి ఉన్న 124 మీటర్ల ఇత్తడి లిఫ్ట్ ద్వారా ఈ భవనంలోకి చేరుకునేలా దీన్ని అత్యంత విలాసవంతంగా నిర్మించారు.

స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం: హిట్లర్ ఆత్మహత్యకు కారణమైన ఈ యుద్ధంలో ఏం జిగింది? ఎలా ముగిసింది?
స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం: హిట్లర్ ఆత్మహత్యకు కారణమైన ఈ యుద్ధంలో ఏం జిగింది? ఎలా ముగిసింది?

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మిత్రరాజ్యాల బాంబు దాడుల్లో కూడా చెక్కుచెదరకుండా మిగిలిన అరుదైన నాజీ కాలపు చారిత్రక చిహ్నం ఇది. నాజీల అరాచకాలకు, భయానక చరిత్రకు గుర్తుగా దీనిని జర్మనీ ప్రభుత్వం భద్రపరుస్తూ వస్తోంది. అయితే, ఈ హఠాత్ ప్రమాదంతో ఆ చారిత్రక నిర్మాణం కనుమరుగవ్వడం అందరిని షాక్ కు గురి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+