ఎన్ కౌంటర్: హిజబుల్ ఉగ్రవాదులు అంతం
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ లో అక్రమంగా చొరబడుతున్న ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి సైన్యం శక్తి వచన లేకుండా పని చేస్తున్నది. సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు అంతం అయ్యారు. ఇంకా ఉగ్రవాదులు ఎవరైనా తల దాచుకున్నారా అని భద్రతా దళాలు ఆరా తీస్తున్నాయి.
శనివారం వేకువ జామున ఓ ఇంటిలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది. స్థానిక పోలీసుల సహకారంతో పుల్వామా జిల్లాలోని పంజ్ గమ్ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టారు. తరువాత ఉగద్రవాదులు భద్రతా దళాల మీద కాల్పులు జరిపారు.

ఆత్మరక్షణ కోసం భద్రతా దళాలు, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. శనివారం ఉదయం వరకు భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కొన్ని గంటల పాటు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు అంతం అయ్యారు. ఇద్దరు తప్పించుకున్నారని తెలిసింది.
ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో మూడు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఎన్ కౌంటర్ లో సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని బ్రిగేడియర్ అధికారి వేణుగోపాల్ తెలిపారు. ఎన్ కౌంటర్ లో ఇద్దరు హిజబుల్ ముజాహిద్దిన్ ఉగ్రవాదులు, ఒకరు ఎల్ ఈటీ ఉగ్రవాది ఉన్నాడని ఆర్మీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications