వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దమ్ము, ధైర్యముంటే పీవోకేలో కాదు శ్రీనగర్ లో జాతీయ జెండా ఎగరవేయండి: ఫరూక్ సవాల్!

|
Google Oneindia TeluguNews

జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ము, ధైర్యముంటే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కాదు, శ్రీనగర్‌ నడిబొడ్డున ఉన్న లాల్ చౌక్‌లో జాతీయ జెండా (తివ్రర్ణ పతాకాన్ని) ఎగరవేయ్యాలని సవాలు చేశారు.

పాక్ అక్రమిత కాశ్మీర్ ( పీవోకే) ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగం కాదంటూ గతంలో చేసిన వ్యాఖ్యలకు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఇప్పుడు మళ్లీ ఈవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పీవోకేలో జాతీయ జెండా ఎగరవేస్తామంటూ మాటలు చెబుతున్నదని ఎద్దేవ చేశారు.

Hoist national flag in Lal Chowk before FoKG: Farooq Abudullah

పీవోకేలో కాదు ముందు శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో జాతీయ జెండా ఎగరవేయ్యాలని సూచించారు. ఆ తర్వాత పాక్ అక్రమిత కాశ్మీర్ లో జాతీయ జెండా ఎగరవెయ్యాలని, తరువాత పాక్ అక్రమిత కాశ్మీర్ గురించి మాట్లాడాలని ఫరూక్ అబ్దుల్లా సూచించారు.

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్‌ మాట్లాడుతూ ఉగ్రవాదులు, వేర్పాటు వాదులను ఫరూక్‌ అబ్దుల్లా ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. లాల్‌ చౌక్‌ లోనే కాదు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నలుమూలలా జాతీయ జెండాను ఎగరవేస్తున్న విషయం ఆయన మరిచిపోయినట్లు ఉన్నారని, ఫరూక్ అబ్దుల్లాకు మతిపోయినట్లు ఉందని ఎద్దేవ చేశారు.

English summary
In yet another controversial remark, Jammu and Kashmir's former chief minister Farooq Abdullah dared the Central government to hoist the national flag at Lal Chowk in the heart of Srinagar city before talking about unfurling it in PoK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X