20 ఏళ్ల యువతితో స్వామీజీ ఎస్కేప్, బాలీవుడ్ హీరో గెటప్, వైరల్, ముచ్చటగా మూడో పెళ్లి, రియల్ ఎస్టేట్ !
బెంగళూరు/ మంగళూరు: మఠంలో పాదపూజ చెయ్యడానికి వెళ్లిన 20 ఏళ్ల యువతితో పరారైన ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని కోలారు సమీపంలోని హోళలి భీమలింగేశ్వర సేవాశ్రయం పీఠాధిపతి దత్తాత్రేయ అవధూత స్వామీజీ ఎట్టకేలకు కర్ణాటకలోని మంగళూరులో పోలీసులకు పట్టుబడ్డారు. స్వామీజీ బాలీవుడ్ హీరో లాగా కొత్త గెటప్ లో చూసిన పోలీసులు, స్థానికులు షాక్ కు గురైనారు. దత్తాత్రేయ అవధూత స్వామీజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను విచారణ చేస్తున్నారు. యువతిని తాను ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల (తిరుపతి)లో వివాహం చేసుకున్నానని దత్తాత్రేయ అవధూత స్వామీజీ అంటున్నారని, ఆయన్ను విచారణ చేస్తున్నామని కోలారు జిల్లా పోలీసులు తెలిపారు. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న స్వామీజీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అనేక మందిని మోసం చేశారని చీటింగ్ కేసులు నమోదైనాయని పోలీసులు తెలిపారు.

మఠంలో శివరాత్రి రోజు 20 ఏళ్ల అమ్మాయి !
కోలారు తాలుకా హోగళి గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి గత నెల శివరాత్రి రోజు ఆశ్రమంలో స్వామీజీకి పాదపూజ చేసి వస్తానని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. తరువాత ఆశ్రమానికి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి వెళ్లలేదు. శివరాత్రి రోజు ఆశ్రమంలో భక్తులతో పాటు మా అమ్మాయి అక్కడే ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు.

స్వామీజీ, యువతి మాయం
మఠానికి వెళ్లిన 20 ఏళ్ల యువతితో దత్తాత్రేయ అవధూత స్వామీజీ మాయం అయ్యాడని వెలుగు చూడటంతో అమ్మాయి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, మఠం భక్తులు షాక్ కు గురైనారు. దత్తాత్రేయ అవధూత స్వామీజీకి పాదపూజ చెయ్యడానికి అప్పుడప్పుడు ఆ యువతి మఠానికి వెళ్లి వస్తోందని, శివరాత్రి రోజు వెళ్లిన తరువాత ఆమె మాయం అయ్యిందని కుటుంబ సభ్యులు కోలారు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అసలు విషయం వెలుగు చూసింది.

తిరుపతిలో యువతితో పెళ్లి
దత్తాత్రయే అవధూత స్వామీజీతో పాటు పారిపోయిన యువతి సోదరుడు అదే మఠంలో పని చేస్తున్నాడు. యువతి సోదరుడికి, ఆయన స్నేహితులకు ఫోన్ చేసిన స్వామీజీ యువతితో తాను తిరుమలలో పెళ్లి చేసుకున్నామని త్వరలో తిరిగి మఠానికి వస్తామని సమాచారం ఇచ్చాడు. దత్తాత్రేయ అవధూత స్వామీజీ యువతిని వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న మఠం భక్తులు, స్థానికులు షాక్ కు గురైనారు. మాయం అయిన అమ్మాయి, స్వామీజీ ఆచూకి తెలుసుకోవడానికి స్వయంగా కోలారు జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి ప్రత్యేక పోలీసు టీంలు ఏర్పాటు చేసి అప్పటి నుంచి స్వామీజీ, యువతి కోసం కోసం గాలించారు.

కొత్త పెళ్లి కూతురితో స్వామీజీ రౌండ్స్
20 ఏళ్ల యువతితో దత్తాత్రేయ అవధూత స్వామీజీ మాయం కావడంతో ఊరి ప్రజలు ఆయన మీద మండిపడ్డారు. తిరుపతిలో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లక ముందే స్వామీజీ, యువతి అక్కడి నుంచి పరారైనారు. తరువాత విజయపురలో స్వామిజీ, యువతి ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లే సరికి స్వామీజీ, యువతి హావేరికి పరారైనారు.

స్వామీజీకి చివరి చాన్స్
కొన్ని రోజుల నుంచి ఇక్కడా అక్కడా తప్పించుకుని తిరుగుతున్న దత్తాత్రయే అవధూత స్వామీజీ, యువతి చివరికి మంగళూరు సమీపంలోని మరడేశ్వరలోని గెస్ట్ హౌస్ లో పోలీసులు చిక్కిపోయారు. మరడేశ్వరలోని గెస్ట్ హౌస్ లో పోలీసులను చూసిన వెంటనే స్వామీజీ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవడంతో పోలీసులు అయన్ను అదుపులోకి తీసుకున్నారు.

స్వామీజీ గెటప్ చూసి షాక్
యువతిని వివాహం చేసుకున్న దత్తాత్రేయ అవధూత స్వామీజీ ఆయన గెటప్ పూర్తిగా మార్చేశారు. నీట్ గా గడ్డం, వెంట్రుకలు కట్ చేసిన స్వామీజీ బాలీవుడ్ హీరోలాగా కొత్త గెటప్ లో దర్శనం ఇవ్వడంతో పోలీసులతో పాటు మఠం భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురైనారు. కావిదారియ ప్రాంతానికి చెందిన దత్తాత్రేయ అవధూత స్వామీజీ (45) అసలు పేరు రాఘవేంద్ర. రాఘవేంద్ర ఆయన పేరును దత్తాత్రయే అవధూత స్వామీజీగా మార్చుకుని కోలారులోని హోగళి గ్రామానికి చెరుకుని అక్కడి ప్రజలను మోసం చేశాడు.
Recommended Video


స్వామీజీది ముచ్చగా మూడో పెళ్లి
గతంలో స్వామీజీకి ఇద్దరు యువతులతో వివాహం అయ్యిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అనేక మందిని మోసం చేశారని ఆయన మీద అనేక చీటింగ్ కేసులు నమోదు అయ్యాయని, అన్ని కేసులు విచారణలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. మొత్తం మీద పెళ్లి కూతురితో స్వామీజీ కొత్త గెటప్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications