మాజీ సీఎం చెవిలో బాంబు పేల్చిన హోం మంత్రి అమిత్ షా, హీరో విషయంలో జాగ్రతగా చూసుకోండి!
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలో జేడీఎస్-బీజేపీ కూటమి పార్టీలు 20 నియోజకవర్గాలకు టికెట్లు ఇప్పటికే ఇచ్చేశాయి, జేడీఎస్‌కు ఇచ్చిన హైవోల్టేజీ నియోజకవర్గం మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు? దీనిపై జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామి అభిప్రాయం ఏమిటి?, అమిత్ షా ఇచ్చిన సూచనలు ఏమిటి? అని ఇప్పడు హాట్ టాపిక్ అయ్యింది.
జేడీఎస్ యువజన విభాగం కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు, సినీ హీరో నిఖిల్ కుమారస్వామి పాత మైసూర్ ప్రాంతంలోని మండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ. కుమారస్వామికి అమిత్ షా ముఖ్యమైన సూచనలు చేశారని వెలుగు చూడటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నిఖిల్ కుమారస్వామి మండ్య లోక్ సభ నియోజక వర్గంలో పోటీ చేయకూడదని, మండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి నువ్వే పోటీ చేయాలని హెచ్ డీ కుమారస్వామికి కేంద్ర హొం మంత్రి అమిత్ షా సూచించినట్లు సమాచారం. మీరు మండ్యలో బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగితే అది మీ గెలుపుకు, పొత్తు భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుందని, కాబట్టి నువ్వే అక్కడ పోటీ చెయ్యడం బీజేపీ, జేడీఎస్ కు మంచిదని అమిత్ షా మాజీ సీఎం కుమారస్వామికి సలహా ఇచ్చారని తెలిసింది.
అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం మీదే అని మాజీ సీఎం కుమారస్వామితో కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారని తెలిసింది. ఒక్కసారిగా తన నిర్ణయం ప్రకటించలేనని, ఈ విషయాన్ని తన తండ్రి, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడతో చర్చించి తమ నిర్ణయం తెలియజేస్తానని మాజీ సీఎం కుమారస్వామి కేంద్ర మంత్రి అమిత్ షాకు చెప్పినట్లు సమాచారం. చిక్కబళ్లాపూరంలో పోటీపై స్పందించిన కేంద్ర మంత్రి అమిత్ షా చిక్కబళ్లాపూరం నియోజకవర్గాన్ని మీ పోటీగా భావించి నిఖిల్ కుమారస్వామి అక్కడి నుంచి పోటీ చేస్తే పొత్తుకు సహకరిస్తుందని అమిత్ షా మాజీ సీఎం కుమారస్వామికి సూచించారని వెలుగు చూసింది.
అయితే మాజీ సీఎం కుమారస్వామికి ఆరోగ్య సమస్య ఉంది. ఇలా చర్చ సందర్భంగా అమిత్ షా సూచనతో మాజీ సీఎం కుమారస్వామి పూర్తిగా ఏకీభవించలేదని, కాదనడానికి కూడా ఇబ్బంది కావడంతో తరువాత చర్చిస్తానని చెప్పారని సమాచారం. మార్చి 19వ తేదీన మంగళవారం మాజీ సీఎం కుమారస్వామి గుండెకు సంబంధించిన చికిత్స చేయించుకోవాలి. కుమారస్వామికి చికిత్స చెయ్యడానికి గురువారం షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్ సభ ఎన్నికల పోటీ చెయ్యడానికి సిద్దం అయితే ఒత్తిడిని ఎదుర్కోవడం సరికాదని కేంద్ర మంత్రి అమిత్ షాకు కుమారస్వామి వివరించారని తెలిసింది.

మండ్యలో ఎవరు పోటీ చెయ్యాలనే విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడతో చర్చించి దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని కుమారస్వామి కేంద్ర మంత్రి అమిత్ షాకు మనవి చేశారని తెలిసింది చిక్కబళ్లాపురంలో మనకు బలం ఉంది, కానీ అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ లేరని, దీనిపై ఆలోచిస్తామని మాజీ సీఎం కుమారస్వామి కేంద్ర మంత్రి అమిత్ షాకు చెప్పారని సమాచారం. మండ్య లోక్ సభ నియోజకవర్గంలో గెలుపు బీజేపీ, జేడీఎస్‌లకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
2019 లోక్ సభ ఎన్నికల్లో నిఖిల్ కుమారస్వామి జేడీఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో బీజేపీ మద్దతు ఉన్న ప్రస్తుత ఎంపీ సుమలత అంబరీష్ పోటీ చేసి భారీ మెజారిటీతో ఎంపీగా విజయం సాధించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ సుమలత అంబరీష్‌కు టిక్కెట్టు దక్కే అవకాశం లేదని తెలిసిపోయింది. సుమలత ఇప్పటికే చాలాసార్లు ఢిల్లీలోని బీజేపీ నేతలను కలుస్తున్నారు.
గతంలో మండ్య నుంచి టికెట్ అడిగారని, అయితే మండ్యలో జేడీఎస్ ఓటమి ఖాయమని తెలిసి ఇప్పుడు మరో నియోజకవర్గం నుంచి లోక్‌సభ టిక్కెట్ ఇవ్వాలని అభ్యర్థించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తన తొలి జాబితాలో మండ్య ఎంపీ సీటు వెంకటరామెగౌడ ( స్టార్ చంద్రు)కు ఇచ్చి ఆయన్ను బరిలోకి దింపింది. లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటించినప్పటికీ మండ్యతో సహా కొన్ని లోక్ సభ నియోజకవర్గాలకు బీజేపీ, జేడీఎస్ కూటమి అభ్యర్థుల ప్రకటన ఇంకా పెండింగ్‌లోనే ఉంది.












Click it and Unblock the Notifications