ప్రధాని కలత చెందారు: గుజరాత్ దళిత ఘటనపై హోంమంత్రి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌ జిల్లా యునా, జునాగఢ్‌ జిల్లా బాత్వా గ్రామాలకు చెందిన ఏడుగురు దళిత యువకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని హోంమంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఈనెల 11న గిర్-సోమనాథ్ జిల్లాలోని యునాలో ఏడుగురు దళిత యువకులపై గో పర్యవేక్షణా కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే.

Also Read: అసలేం జరిగింది?: గుజరాత్‌లో దళితుల రగడ, హెడ్ కానిస్టేబుల్ మృతి

గోవులను చంపి, చర్మం వొలుస్తున్నారనే ఆరోపణలతో వాళ్లని తాళ్లతో కట్టేసి క్రూరంగా దాడి చేశారు. ఈ ఘటనపై గుజరాత్‌లో దళితుల ఆందోళన ఉధృతం చేసిన నేపథ్యంలో బుధవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభలో వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ప్రధాని మోడీని సైతం కలత చెందారని చెప్పిన ఆయన దాడి ఘటనకు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేశామన్నారు.

Home Minister Rajnath Singh's statement in lok sabha on gujarat una incident

ఇందులో ఏడుగురిని రిమాండ్ తరలించగా, మరో ఇద్దరు పోలీసు కస్టడీలో ఉన్నట్లు పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నలుగురు పోలీసు అధికారులను సైతం సస్పెండ్ చేసినట్లు సభలో ప్రస్తావించారు. రెండు నెలల్లోగా ఈ ఘటనపై చార్జీషీట్ దాఖలు చేయాలని ఆదేశించామని ఆయన తెలిపారు.

దళితులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి విచారణకు ప్రత్యేక కమిటీని నియమించి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామని లోక్‌సభ సాక్షిగా ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనతో గుజరాత్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలను అదుపులోకి తెచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.

బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. దళితులపై వేధింపులు సరికాదని చెప్పిన ఆయన గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులపై అనేక దాడులు జరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ పాలనలో అలాంటిదేమి లేదని పేర్కొనడం విశేషం.

దీంతో హోంమంత్రి రాజ్‌నాథ్ వివరణపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పార్లమెంటరీ స్థాయి కమిటీ నియమించాలని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ దళిత యువకులపై జరిగిన దాడిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

మంగళవారం అమ్రేలి పట్టణంలో జరిగిన ఘర్షణల్లో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఘర్షణల్లో భాగంగా రాళ్ల దెబ్బలకు గాయపడ్డ ఓ కానిస్టేబుల్ పంకజ్ అమ్రేలి రాజ్‌కోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆందోళన కారులు ఓ బస్సుకు కూడా అంటించారు.

అసలేం జరిగింది?:
గత వారం రాజ్‌కోట్‌ జిల్లా యునా, జునాగఢ్‌ జిల్లా బాత్వా గ్రామాలకు చెందిన ఏడుగురు దళితులపై గో పర్యవేక్షణా కార్యకర్తలు దాడిచేశారు. గోవులను చంపి, చర్మం వొలుస్తున్నారంటూ వాళ్లని తాళ్లతో కట్టేశారు. తాము చచ్చిన గోవుల చర్మం తీస్తున్నామని చెప్పినా వినిపించుకోకుండా కొట్టారు. దీంతో మనస్థాపం చెందిన ఏడుగురు యువకులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Home Minister Rajnath Singh's statement in lok sabha of gujarat una incident.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X