Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

HOUSE FULL: సూపర్ స్టార్, మెగాస్టార్ సినిమా హాల్ కాదు, విషయం తెలిసి ప్రజలు పరుగో పరుగు !

బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID-19) దెబ్బతో ప్రజలు రోడ్ల మీదకు రావాలంటే హడలిపోతున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు, నగరాలలో లాక్ డౌన్, జనతా కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ అంటూ అనేక ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కరోనా వైరస్ దెబ్బతో సినిమా థియేటర్లు మూతపడుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఎక్కడ చనిపోతున్నారో అర్థం కాక ఇటు బంధువులతో పాటు సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ చోట HOUSE FULL బోర్డు పెట్టడం కలకలం రేపింది. హౌస్ ఫుల్ బోర్డు పెట్టింది మెగాస్టార్ చిరంజీవి సినిమానో, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా హాల్ ముందు మాత్రం కాదు హౌస్ ఫుల్ బోర్డు చూసిన ప్రజలు భయంతో అటు వైపు వెళ్లడానికి హడలిచస్తున్నారు.

 ఐటీ హబ్ లో కరోనా కల్లోలం

ఐటీ హబ్ లో కరోనా కల్లోలం

బెంగళూరు నగరంలో కోటి మందికిపైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. అధికారిక లెక్కలు ఎలా ఉన్నా ఐటీ హబ్ లో కోటి మందికి పైగానే ప్రజలు నివాసం ఉంటున్నారని అధికారులే అనాధికారికంగా ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారు. ఇలాంటి ఐటీ హబ్ లో కరోనా వైరస్ మహమ్మారి భరతనాట్యం చేస్తోంది.

 ఓ పక్క లాక్ డౌన్.... మరో పక్క గంగజాతర

ఓ పక్క లాక్ డౌన్.... మరో పక్క గంగజాతర

బెంగళూరులో పనిపాట లేనిపోటుగాళ్లు చాలా మందే ఉన్నారనేది జగమెరిగిన సత్యం. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోడ్ల మీదకు రావాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే బెంగళూరులో పరిస్థితి వేరుగా ఉంది. పనిపాటలేని చిల్లరగాళ్లు పోలో అంటూ బైక్ లు, కార్లు వేసుకుని రోడ్ల మీదకు రయ్... రయ్ మంటూ వచ్చేస్తూ లాక్ డౌన్ కు అర్థంపర్థం లేకుండా చేస్తున్నారని సామాన్య ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

 సినిమా హాల్ కాదు... దెబ్బకు పరుగో పరుగు

సినిమా హాల్ కాదు... దెబ్బకు పరుగో పరుగు

బెంగళూరు నగరంలోని చామరాజపేటలో టీఆర్. స్మశానవాటిక ఉంది. ప్రతిరోజు టీఆర్. స్మశానవాటికలో కేవలం 20 మందికి మాత్రమే అంత్యసంస్కారాలు చేసి వారి శవాలను దహనం చెయ్యడానికి ఆస్కారం ఉంది. చామరాజపేటలోని టీఆర్. మిల్ స్మశానవాటిక గేట్ ముందు హౌస్ ఫుల్ బోర్డు తగిలించడం కలకం రేపింది. ఇది సినిమా థియేటరా ?, రోజూ మనం చూసే స్మశానవాటికా ? అని స్థానికులకు అనుమానం పెరిగిపోయింది.

 ఏం జరిగింది ?, ఏం జరుగుతోంది

ఏం జరిగింది ?, ఏం జరుగుతోంది

ఆదివారం బెంగళూరు నగరంలో చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చామరాజపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో చనిపోయిన వారిలో 40 మంది మృతదేహాలు ఒకేసారి చామరాజపేటలోని టీఆర్. స్మశానవాటికి తీసుకెళ్లడంతో అక్కడ ఉన్న సిబ్బందికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే స్మశానవాటిక సిబ్బంది తెలిసిన వాళ్ల జిరాక్స్ సెంటర్ తీపించి అక్కడ HOUSE FULL అని ప్రింట్ ఔట్ లు తీపించి వెంటనే గేట్ కు తగిలించడం కలకలం రేపింది.

Recommended Video

    SSMB 28 : Mahesh Babu, Trivikram నుంచి 11 ఏళ్ల తర్వాత.. హీరోయిన్ ఆమెనా? || Oneindia Telugu
     మెగాస్టార్, సూపర్ స్టార్ సినిమా థియేటర్లు కాదు

    మెగాస్టార్, సూపర్ స్టార్ సినిమా థియేటర్లు కాదు

    బెంగళూరు నగరంలో ఓ స్మశానవాటికకు హౌస్ ఫుల్ బోర్డు తగిలించడం ఇంత వరకు ఎన్నడూ జరగలేదని ప్రజలు అంటున్నారు. గతంలో మేము మెగాస్టార్, సూపర్ స్టార్ సినిమా థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు చూసేవాళ్లమని, ఇప్పుడు స్మశానాలకు హౌస్ ఫుల్ బోర్డు చూడాల్సి వస్తోందని బెంగళూరు ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. అతిపెద్ద స్మశానవాటికకు హౌస్ ఫుల్ బోర్డు తగిలించడం చూస్తే బెంగళూరులో కరోనా మరణాలు, సర్వసాధారణంగా చనిపోతున్న వారి సంఖ్య ఎలాగుందో అర్థం అవుతోందని ప్రజలు అంటున్నారు. టీఆర్ మిల్ స్మశానవాటిక దెబ్బతో అటు వైపు వెలుతున్న ప్రజలు పరుగో పరుగు అంటూ పారిపోతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+