ఈ టెక్కీ మన్మథుడికే మామ, ఇద్దరు భార్యలను ఎలా డీల్ చేశాడంటే ?, కేసు లేదు, షిఫ్ట్ ల్లో కాపురం, ఎంజాయ్ !
ఓ టెక్కీ ఇద్దరు భార్యల విషయంలో డీల్ చేసిన విధానం చూసి అతను మన్మధుడికే మామ అనే పేరు తెచ్చుకున్నాడు. కోర్టులో ఉన్న కేసు వెనక్కి వచ్చింది.
గురుగ్రామ్/న్యూఢిల్లీ: సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కొత్తకొత్త టెక్నాలజీ కనిపెట్టి వారు పని చేస్తున్న కంపెనీల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని లక్షల్లో జీతాలు సంపాధిస్తున్నారు. టెక్కీ అలుడు చిక్కితే మా కూతురు సుఖంగా ఉంటుందని అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆశపడుతుంటారు. అయితే ఇక్కడ ఓ టెక్కీ ఇద్దరు భార్యల విషయంలో డీల్ చేసిన విధానం చూసి అతను మన్మధుడికే మామ అనే పేరు తెచ్చుకున్నాడు. కోర్టులో ఉన్న కేసు వెనక్కి వచ్చింది. కథ. మాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం అన్నీ ఆ టెక్కీనే అయ్యాడు. పాన్ ఇండియా లెవల్లో ఆ టెక్కీ ఫ్యామిలీ స్టోరీ ఉంది. షిఫ్ట్ ల్లో కాపురం చెయ్యడానికి టెక్కీ రెఢీ అయ్యాడు.

పెళ్లి చేసుకున్న టెక్కీ
హరియానాలోని గురుగ్రామ్ లో స్వరూప్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతం తీసుకున్న స్వరూప్ కు అతని కుటుంబ సభ్యులు గ్వాలియర్ లో నివాసం ఉండే సీమా అనే యువతిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని మాట్లాడుకున్నారు. 2018లో సీమా (28) అనే యువతిని వివాహం చేసుకున్న స్వరూప్ ఆమెతో సంతోషంగా కాపురం చేశాడు. స్వరూప్, సీమా దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు.

లాక్ డౌన్ లో ఏం జరిగింది ?
గురుగ్రామ్ లో అద్దె ఇల్లు తీసుకున్న స్వరూప్ అతని భార్య సీమా, కుమారుడితో కలిసి చాలా సంతోషంగా ఉండేవాడు. వీకెండ్ లో భార్య సీమా, కుమారుడితో కలిసి సినిమాలు, షికార్లు, వీకెండ్ పార్టీలు అని తిరిగేశాడు. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో భార్య సీమా, కుమారుడు సేఫ్ ఉండాలని అనుకున్న టెక్కీ ఇద్దరిని గ్వాలియర్ లోని అత్తారింటికి పంపించాడు. గురగ్రామ్ లోనే ఉండిపోయిన స్వరూప్ ఉద్యోగం చేస్తూ ప్రతినెల భార్యకు డబ్బులు పంపించాడు.

ఆఫీసులో ప్రియురాలు
లాక్ డౌన్ లో ఒంటరిగా ఉన్న స్వరూప్ కు అతన కంపెనీలో అతనితో పాటు ఉద్యోగం చేస్తున్న లేడీ టెక్కీ స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో చనువు ఏర్పడింది. లాక్ డౌన్ లో మరో మహిళా టెక్కీతో స్వరూప్ శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తరువాత ఇద్దరూ కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ప్రియురాలు స్వప్నా గర్బవతి కావడంతో ఆమెను స్వరూప్ రెండో పెళ్లి చేసుకున్నాడు. స్వరూప్, స్వప్నా దంపతులకు ఓ కుమార్తె ఉంది.

ఫస్ట్ భార్యకు మ్యాటర్ లీక్ అయ్యింది
లాక్ డౌన్ ముందు భార్య సీమాను అత్తారింటికి పంపించిన స్వరూప్ ఇక్కడ రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండ మూడు నెలలకు ఒకసారి సీమా ఇంటికి వెళ్లి ఆమెతో కొన్ని రోజులు సంతోషంగా గడిపి తరువాత గురగ్రామ్ వెళ్లి అక్కడ రెండో భార్య స్వప్నాతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంతకాలం అయినా భర్త స్వరూప్ తనను గురుగ్రామ్ కు ఎందుకు పిలుచుకుని వెళ్లలేదు అని సీమాకు డౌట్ వచ్చింది. భర్త స్వరూప్ కు డౌట్ రాకుండా సీమా ఆరా తీసింది. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న సీమా నేరుగా గురుగ్రామ్ వెళ్లింది.

కోర్టులో కేసు వేసిన మొదటి భార్య
భర్త స్వరూప్ రెండో భార్య ఇంటి ముందు సీమా ప్రత్యక్షం అయ్యింది. నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ? అంటూ సీమా రెచ్చిపోయింది. తనకు, తన కుమారుడి పోషణ కోసం తన భర్త నుంచి భరణం ఇప్పించాలని, తనకు విడాకులు కావాలని సీమా కోర్టుకు వెళ్లింది. అయితే ఇక్కడ టెక్కీ ఆవేశంతో విడాకులు ఇవ్వకుండా మొదటి భార్య సీమాతో రాజీకావాలని డిసైడ్ అయ్యాడు. సీమాతో మాట్లాడిన ఆమె భర్త టెక్కీ స్వరూప్ నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బులు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని చెప్పాడు.

డబ్బు+సుఖం+ పరువు మర్యాద ఉంటాయి
అయితే నీకు భర్త లేడి, కొడుక్కు తండ్రి లేడని ఈ సమాజం చులనగా చూస్తారని, నువ్వు నాతోనే కలిసి ఉంటే మన కొడుకును బాగా చదవించి ప్రయోజకుడిని చేద్దామని, నువ్వు కేసు వెనక్కి తీసుకోవాలని మొదటి భార్య సీమాకు నచ్చ చెప్పాడు. రెండో భార్య స్వప్నాను కూడా కలిసి ఉండేలా టెక్కీ స్వరూప్ మాట్లాడాడు. ఇద్దరు భార్యలను విడివిడిగా మాట్లాడిన టెక్కీ స్వరూప్ ఇద్దరిని రాజీ చేసి అతని దారిలోకి తెచ్చుకున్నాడు. అయితే ఇద్దరూ భార్యలు ఒకే ఇంటిలో ఉండటానికి మాత్రం అంగీకరించలేదు.

ఈ టెక్కీ మామూలోడు కాదు. కేసులేదు, ఇద్దరు భార్యలతో హ్యాపీ
ఫ్యామిలీ కోర్టులో కేసు వెనక్కి తీసుకోవడానికి వెళ్లిన మొదటి భార్య సీమా ఓ డిమాండ్ ముందు పెట్టింది. వారంలో మూడు రోజులు కచ్చితంగా తనతోనే ఉండాలని, మరో మూడు రోజులు రెండో భార్యతో కలిసి ఉండటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సీమా కోర్టులో చెప్పింది. సీమా డిమాండ్ కు ఆమె భర్త, అతని రెండో భార్య ఓకే చెప్పారు. వారంలో మూడు రోజులు మొదటి భార్యతో, మరో మూడు రోజులు రెండో భార్యతో కలిసి ఉండటానికి టెక్కీ స్వరూప్ కోర్టులోనే అంగీకరించాడు. అయితే ఆదివారం మాత్రం టెక్కీ ఎక్కడికైనా వెళ్లవచ్చని, ఇద్దరు భార్యల్లో ఎవరితో కావాలంటే వారితో ఉండవచ్చని కోర్టులో ముగ్గురు ఒప్పందం చేసుకున్నారు.

ఇవీవీ సత్యనారాయణ ఫార్ములా
మొత్తం మీద టెక్కీ ఇద్దరు భార్యలను డీల్ చేసిన విధానం చూసి అతనితో పాటు ఉద్యోగం చేస్తున్న సాటి ఉద్యోగులు షాక్ అయ్యారని గురుగ్రామ్ కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ హరీష్ కథనం ప్రచురించాడు. 30 ఏళ్ల క్రితం శోభన్ బాబు, వాణిశ్రీ, శారదాలో ఇవీవీ సత్యనారాయణ ఏమండి ఆవిడ వచ్చింది అనే సూపర్ హిట్ సినిమా తీశారు. ఈ సినిమాలో శోభన్ బాబు వారంలో మూడు రోజులు శారద ఇంటిలో, మరో మూడు రోజులు వాణిశ్రీ ఇంటిలో ఉండా. ఆదివారం శోభన్ బాబు అతని తల్లిదండ్రులు సత్యనారాయణ దంపతుల ఇంట్లో ఉంటాడు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications