వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్-2 ప్రయోగం : మోడీ, రాహులే కాదు.. విదేశీ మీడియా కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఇస్రో కృషికి సలాం అంటున్న విదేశీ మీడియా|How Foreign Media Reacted To ISRO Losing Contact With Lander

న్యూఢిల్లీ : చంద్రుడి ఉపరితలంలోకి విక్రమ్ ల్యాండ్ రొవర్ చేరుకొనే కొన్ని సెకన్ల ముందు ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ .. తదితరులంతా ఇస్రో శాస్త్రవేత్తల పనితీరుపై ప్రశంసలు కురిపించారు. జాతి యావత్ ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలిచింది. ఒక్క దేశమే కాదు విదేశీ మీడియా కూడా ఇస్రో పనితీరును ప్రశంసించింది. ఎవరూ చేయని సాహసం చేసి శెభాష్ అనిపించుకొందని కొనియాడింది. ఈ మేరకు అమెరికాకు చెందిన మీడియా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించింది.

జాతి మొత్తం మీ వెనకే ఉంది.. ఇస్రో శాస్త్రవేత్తలకు రాహుల్ గాంధీ భరోసా, కొనియాడిన కాంగ్రెస్జాతి మొత్తం మీ వెనకే ఉంది.. ఇస్రో శాస్త్రవేత్తలకు రాహుల్ గాంధీ భరోసా, కొనియాడిన కాంగ్రెస్

ఇస్రో భేస్

ఇస్రో భేస్

చంద్రయాన్-2 మిషన్ కేవలం విక్రమ్ ల్యాండ్ రొవర్ సంబంధించి సంబంధాలను మాత్రమే కోల్పోయింది. అన్నీ కాదు .. ప్రయోగం ఒకరకంగా సక్సెస్ సాధించినట్టేనని అమెరికాకు చెందిన మ్యాగజైన్ వైర్ పేర్కొంది. ముందుగా అంచనా వేసిన ప్రకారం విక్రమ్ ల్యాండ్ రొవర్ వెళ్లినా .. ఇస్రోతో సంబంధాలు తెగిపోయానని గుర్తుచేసింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ -2 అనేది పెద్ద కార్యక్రమమని .. కానీ సంబంధాలు తెగిపోవడం అనేది సాంకేతిక లోపమని పేర్కొన్నది.

ఇదో మైలురాయి

ఇదో మైలురాయి

చంద్రయాన్-2 అనేది ఇంజనీరింగ్ పరాక్రమం అని, ఇస్రో దశాబ్దల చరిత్రిలో ఇదో మైలురాయి అని కొనియాడింది న్యూయార్క్ టైమ్స్. ప్రపంచ యవనికపై ఇండియాను నిలబెట్టేందుకు శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నది. న్యూయార్క్ టైమ్స్ మాదిరిగానే ఫ్రెంచ్ డైలీ కూడా స్పందించింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ రొవర్ లాంచ్ అయ్యింది. కానీ సిగ్నల్స్ అందకపోవడం అనేది దురదృష్టకరమని అభిప్రాయపడింది. దీంతో మిషన్ 45 శాతం విజయం సాధించిందని తెలిపింది.

మరో ముందడుగు

మరో ముందడుగు

మరో 20 ఏళ్లు లేదా 50, 100 ఏళ్లలో చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసుకోవడం ఖాయమని బ్రిటిష్ పత్రిక గార్డియన్ పేర్కొంది. ఇందుకోసం భారత్ ముందుడుగు వేసిందని అభిప్రాయపడింది. అయితే వాషింగ్టన్ పోస్ట్ రియాక్షన్ మాత్రం కాస్త వ్యతిరేకంగా అనిపించింది. చంద్రయాన్-2 ప్రయోగంతో భవిష్యత్‌లో చేపట్టే అంతరిక్ష ప్రయోగాలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది.

English summary
chandrayaan 2, India's 'complex' mission to the Moon's south pole, made headlines globally after the Indian Space Research Organisation (Isro) lost communication with Vikram Lander of Chandrayaan-2 just moments before its scheduled soft landing on Saturday. Not only India, but the entire world is applauding Isro for daring to go where no one else has managed to. Here is how foreign media reported the Chandrayaan-2 moon landing:
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X