‘రాహుల్ అందగాడు’: 107ఏళ్ల బామ్మకి ‘బిగ్ హగ్’ అంటూ ఫోన్

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నారు. తాజాగా, తన 107వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఓ బామ్మకు శుభాకాంక్షలు తెలిపాడు .

ఎందుకంటే.. ఆ బామ్మకి రాహుల్‌గాంధీ అంటే చాలా ఇష్టం. పుట్టినరోజు సందర్భంగా నీకేం కావాలని ఆమె మనవరాలు దీపాలి సికంద్‌ అడిగారు.

దీనికి ఆమె ముసిముసి నవ్వులు నవ్వుతూ రాహుల్‌ను కలవాలని చెప్పింది. ఎందుకు?.. అని బామ్మని ప్రశ్నిస్తే.. 'రాహుల్‌ అందగాడు' అంటూ చెవిలో చెప్పి సిగ్గు పడిపోయిందట. ఇదే విషయాన్ని దీపాలి తన ట్విట్టర్‌ ఖాతాలో రాహుల్‌కి ట్వీట్‌ చేసింది.

ఈ ట్వీట్‌కు స్పందించిన రాహుల్‌...'ప్రియమైన దీపాలి, మీ అందమైన బామ్మగారికి నా జన్మదిన శుభాకాంక్షలు, క్రిస్మస్‌ను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. నా తరఫున మీరే ఒకసారి బిగికౌగిలిలో బంధించండి. ఇట్లు మీ రాహుల్‌' అని ఆయన తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో వ్యాఖ్యానించారు. అంతేగాక, ఆమెకు ఫోన్‌ చేసిమరీ బామ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On Monday, when the entire world was celebrating Christmas, Congress president Rahul Gandhi turned Santa Claus for a 107-year-old grandmother in Bengaluru, literally.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి