హార్ముజ్ పై సన్నగిల్లుతున్న ఆశలు..? చమురు శుద్ధి కర్మాగారాల కీలక నిర్ణయం..!
పశ్చిమాసియా ఘర్షణలు, దాంతో హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన రవాణా ఆటంకాల మధ్య భారత చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగుతాయో ఎవరికీ తెలియని పరిస్ధితి. అయితే అంతకాలం చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి చమురు రిఫైనరీలు (Oil refiners), కంపెనీలే కాదు దేశంలో ఎవరూ సిద్దంగా లేరు. ఈ నేపథ్యంలో చమురు రిఫైనరీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం చేస్తున్న ముడి చమురు శుద్దిని పెంచడంతో పాటు భవిష్యత్ అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెడుతున్నాయి.
హార్ముజ్ సంక్షోభంతో రిఫైనరీల కీలక నిర్ణయం (oil refiners)
ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఇంధనాల ఉత్పత్తిని పెంచడానికి, సంక్లిష్ట ముడిచమురు గ్రేడ్‌లను సమర్థంగా నిర్వహించడానికి చమురు రిఫైనరీలకు ప్రత్యామ్నాయ సరఫరాదారుల అవసరం ఏర్పడింది. భౌగోళిక రాజకీయాల అనిశ్చితి, భారత్‌కు సాంప్రదాయ ముడిచమురు సరఫరాలను దెబ్బతీసిన నేపథ్యంలో..రిఫైనరీలు తమ సాధారణ ఫీడ్‌స్టాక్ మిక్స్‌లో లేని క్రూడ్ రకాలను శుద్ధి చేయాల్సి వస్తోంది. నాలుగేళ్ల క్రితం ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు భారత రిఫైనింగ్ రంగం ఇలాంటి సర్దుబాట్లు చేసుకుంది. అప్పుడు రిఫైనరీలు రాయితీతో లభించిన రష్యా ముడిచమురును భారీగా కొనుగోలు చేసి, తమ కర్మాగారాల సామర్ధ్యాన్ని మించి శుద్ధి చేశాయి. ఇప్పుడు కూడా అలాగే ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెట్టాయి.

క్రూడ్ శుద్ది పెంపుతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలు
ప్రస్తుతం లమ్మస్ టెక్నాలజీలను ఉపయోగించే చమురు రిఫైనరీలు ముడిచమురు వినియోగాన్ని పునర్వ్యవస్థీకరించడంలో, హైడ్రోక్రాకర్ల వంటి అనుకూల వనరుల్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆసక్తి చూపుతున్నాయి. క్లిష్టమైన క్రూడ్‌ను శుద్ధి చేస్తూనే, మార్కెట్ డిమాండ్‌కు తగిన ఇంధనాలను ఉత్పత్తి చేయడమే వారి ప్రధాన లక్ష్యం. దీంతో మన రిఫైనరీలు ఇప్పుడు సాంప్రదాయ శుద్ధి ప్రక్రియలకు మించి అవకాశాలను అన్వేషిస్తున్నాయి. గ్యాస్-టు-కెమికల్స్, ఆయిల్-టు-కెమికల్స్ ప్రాజెక్ట్‌లు, ప్రీమియం లూబ్రికెంట్ బేస్ ఆయిల్స్, పాలిప్రొపైలిన్, పాలిథిలిన్, డిలేడ్ కోకింగ్ సౌకర్యాలపై పెరుగుతున్న ఆసక్తే దీనికి నిదర్శనం. ఈ సాంకేతికత ఇరాన్ వివాదంతో ప్రభావితమైన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ప్రాంతంలోని ప్రాజెక్టులతో ముడిపడి ఉంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ, పెద్ద ప్రాజెక్ట్ రద్దులు లేదా అమలు ఆలస్యాలు లేకపోవడం ఊరట.

ఉమ్మడి ప్రాజెక్టులపై గల్ఫ్ దేశాల కన్ను
హార్ముజ్ జలసంధిపై తమ ఎగుమతి మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఆధారపడిన కువైట్, ఖతార్, ఇరాక్ వంటి దేశాలు విశ్వసనీయ మార్గాలకై ఉమ్మడి వెంచర్లు, ప్రత్యామ్నాయ ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలిస్తున్నాయి. ప్రస్తుత అనిశ్చితి ఈ ప్రాంతంలో పెట్టుబడి విధానాలను కూడా మార్చేస్తోంది. కొన్ని జీసీసీ దేశాలు ఆసియాలోని విదేశీ ప్రాజెక్టుల నుండి మూలధనాన్ని మళ్లించి, తమ సరిహద్దుల లోపల పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే ఘర్షణలు సద్దుమణిగిన తర్వాత, దెబ్బతిన్న అనేక కీలక చమురు, గ్యాస్ సంస్థలు కొత్త అవకాశాలను సృష్టించవచ్చు. ప్రభావితమైన ఇంధన ఆస్తుల పునర్నిర్మాణ ప్రయత్నాలు, సామగ్రి మార్పిడి, మరమ్మతులు రిఫైనింగ్, పెట్రోకెమికల్ టెక్నాలజీ రంగంలోని కంపెనీలకు గణనీయమైన వ్యాపార అవకాశాలపై దృష్టిసారించబోతున్నాయి.












Click it and Unblock the Notifications