కర్ణాటక సీఎంలకు వాస్తు దోషమా, 76 ఏళ్లలో ముగ్గురు సీఎంలు మాత్రమే, రికార్డు !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చెయ్యడానికి వేదిక ముస్తాబు అవుతున్నది. అయితే రెండున్నర సంవత్సరాల మాత్రమే సీఎంగా ఉండటానికి అవకాశం ఉండటంతో సిద్దరామయ్య కొంచెం దిగులుగా ఉన్నారని తెలిసింది. అయితే కర్ణాటక చరిత్రలో ఇంత వరకు ఐదు సంవత్సరాలు పూర్తిగా అధికారంలో ఉన్న సీఎంలు ఎంత మంది అంటే ?.
కర్ణాటకలో చాలా మంది ముఖ్యమంత్రులు వారి అధికారం పూర్తి కాకుండానే ఏదో ఒక రకంగా, అనేక కారణాల వలన సీఎం పదవులుకు రాజీమా చేసి ఇంటికి వెళ్లిపోయారు. 2013లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సిద్దరామయ్య ఆయన అవది పూర్తి అయ్యే వరకు అంటే 2018 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.

సిద్దరామయ్య కంటే ముందు కేవలం ఇద్దరు సీఎంలు మాత్రమే ఐదు సంవత్సరాలు పూర్తి పదవి కాలంలో ఉన్నారు. 76 ఏళ్ల కర్ణటక చరిత్రలో కేవలం ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమే వారి పదవి కాలం పూర్తి అయ్యే వరకు సీఎంలుగా పని చేశారు. మిగిలిన సీఎంలు అందరూ పలు కారణాలతో వారి పదవి కాలం పూర్తి కాకుండానే సీఎం పదవులుకు రాజీనామా చేశారు.
కర్ణాటక రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత నిజలింగప్ప, దేవరాజ్ అరుసు తరువాత సిద్దరామయ్య మాత్రమే ఐదు సంవత్సరాలు పదవికాలం పూర్తి చేసుకున్నారు. కర్ణాటక మైసూరు రాజ్యంగా ఉన్న సమయంలో నిజలింగప్ప సీఎం అయ్యారు. 1856 నుంచి 1958 వరకు నిజలింగప్ప సీఎంగా పని చేశారు. తరువాత వరుసగా సీఎంలు మారిపోయారు.

1962 జూన్ 21వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిజలింగప్ప 1968 మే 29వ తేదీ వరకు అంటే ఐదు సంవత్సరాలు ఆయన పదవి కాలం పూర్తి అయ్యే వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. కర్ణాటకలో ఐదు సంవత్సరాలు పూర్తిగా పదవి కాలంలో ఉన్న మొట్టమొదటి సీఎం ఎస్ నిజలింగప్ప.
మైసూరు రాజ్యాన్ని కర్ణాటకగా నామకరం చేసిన తరువాత 1972 మార్చి 20వ తేదీన కాంగ్రెస్ పార్టీకి చెందిన దేవరాజ్ అరసు కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. 1978 ఫిబ్రవరి 28వ తేదీ వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేసిన దేవరాజ్ అరసు ప్రజల మనిషిగా, పేదలను ఆదుకున్న సీఎంగా అందరి దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
1978 ఫిబ్రవరి మరోసారి సీఎం అయిన దేవరాజ్ అరసు 1980 జనవరి 7వ తేదీ వరకు సీఎంగా పని చేసి తరువాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 1978 నుంచి 2013వ సంవత్సరం వరకు కర్ణాటకకు ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవ్వరు కూడా ఐదు సంవత్సరాల పూర్తి పదవికాలంలో ఉండలేక వివిద కారణాలతో మధ్యలోనే సీఎం పదవులకు రాజీనామా చేశారు.

2013 మే 13వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సిద్దరామయ్య కూడా మధ్యలోనే ఊడిపోతారు అని చాలా మంది అనుకున్నారు. అయితే 2013 మే 13వ తేదీ నుంచి 2018 మే నెల వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పూర్తిగా పదవికాలంలో ఉన్న సిద్దరామయ్య రికార్డు సృష్టించారు. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సిద్దరామయ్య రెండున్నర సంవత్సరాల తరువాత సీఎం పదవికి రాజీనామా చేసి ఆ పదవిని డీకే శివకుమార్ కు అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.












Click it and Unblock the Notifications