భారత ఎంపీలు ఎన్ని దేశాలకు వెళ్తున్నారు ? ఎవరు ఏ దేశానికి అంటే ??

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడితో భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి గట్టి కౌంటర్ ఇచ్చింది భారత్.
ఈ క్రమంలోనే దాయాది దేశంపై దౌత్యపరమైన చర్యలకు రంగం సిద్దం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్.. ప్రపంచ దేశాలపై ఎలా విషం చిమ్ముతుందో, దాని వల్ల భవిష్యత్తులో రాబోయే సమస్యలు ఏంటో అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

కేంద్రం ప్రకటించిన ఏడుగురు అఖిలపక్ష ఎంపీల్లో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), కనిమొళి (డిఎంకె), రవిశంకర్‌ ప్రసాద్‌(బిజెపి), బైజయంత్‌ పాండా (బిజెపి), సంజరు కుమార్‌ ఝా(జెడియు), శ్రీకాంత్‌ షిండే (శివసేన)లు విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నారు. అయితే ఇప్పుడు ఈ ఏడు బృందాలు మొత్తంగా 32 దేశాలకు వెళ్లనున్నాయి. ఆపరేషన్ సిందూర్, పాక్ ఉగ్రవాద చర్యల గురించి ఆయా బృందాలు వివరించనున్నాయి.

how-many-countries-are-indian-mps-going-to-who-is-going-to-which-country

ఈ ఏడు బృందాలు మే 22న భారత్‌లో బయలుదేరి మరలా జూన్‌ మొదటివారంలో తిరిగి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. ఏయే బృందాలు ఏయే దేశాలకు వెళ్లబోతున్నాయో ప్రకటించారు. అవేంటో తెలుసుకుందాం..

శశిథరూర్ టీం..

అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా

సుప్రియా సూలె టీం..

ఈజిప్టు, ఖతార్, ఇథియోపియా, దిక్షిణాఫ్రికా

కనిమొళి టీం..

స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యా

బైజయంత్ పాండా టీం..

సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా

రవశంకర్ ప్రసాద్ టీం..

యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్

సంజయ్ కుమార్ ఝా టీం..

ఇండోనేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్

శ్రీకాంత్ శిండే టీం..

యూఏఈ, లైబీరియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియొర్రా లియోన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+