వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దటీజ్ యోగి ఆదిత్యనాథ్: అందరు సీఎంలు ఓకవైపు, ఈయన ఒకవైపు

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇటీవల అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అనూహ్యంగా సీఎం పగ్గాలు చేపట్టిన ఆయన దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇటీవల అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అనూహ్యంగా సీఎం పగ్గాలు చేపట్టిన ఆయన దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారారు.

ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన అనంతరం ఆయన తీసుకున్న నిర్ణయాలూ సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలనీ, లేదంటే సదరు ఉద్యోగులకు పదోన్నతులు, బోనస్‌ విషయంలో కోతపడుతుందన్నారు.

అంతేకాదు, గ్రామాలకు విద్యుత్, అక్రమ కబేళాలపై చర్యలు, రిజర్వేషన్లు.. ఇలా ఆయన ఏం చేసినా సంచలనమే అవుతోంది. దేశ వ్యాప్తంగా యోగి ఆదిత్యనాథ్‌ పాపులర్‌ అయిపోయారు.

ఈ మార్క్ శనివారం నుంచి భువనేశ్వర్‌లో జరగనున్న బీజేపీ జాతీయస్థాయి సమావేశంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. స్థానిక జనతా మైదాన్‌లో ఏర్పాటు చేసిన పోస్టర్లే ఇందుకు నిదర్శనం.

13 మంది బీజేపీ ముఖ్యమంత్రుల్లో..

13 మంది బీజేపీ ముఖ్యమంత్రుల్లో..

దేశవ్యాప్తంగా 13 మంది బీజేపీ ముఖ్యమంత్రులతో కూడిన పోస్టర్‌ తయారు చేశారు. దీనిలో కేవలం ఆదిత్యనాథ్‌ ఒకవైపు వుండగా మిగతా ముఖ్యమంత్రులు మరోవైపు ఉన్నారు.

ఆదిత్యనాథ్ స్థాయి స్థాయి ఇది..

ఆదిత్యనాథ్ స్థాయి స్థాయి ఇది..

దీనిని బట్టి యోగి ఆదిత్యనాథ్‌ ఏ స్థాయికి ఎదిగారో అర్థమవుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా, సీనియర్‌ నాయకులు అద్వానీ తదితరులు హాజరుకానున్నారు.

అఖిలేష్ పైన యోగి ఆగ్రహం

అఖిలేష్ పైన యోగి ఆగ్రహం

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పైన యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. కేంద్రానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో గతంలో అఖిలేష్ యాదవ్ కేంద్రం నుంచి నిధులను నిరాకరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి క్రెడిట్ వెళ్తుందని నిరాకరించారన్నారు.

ఇరవై నాలుగు గంటలు విద్యుత్

ఇరవై నాలుగు గంటలు విద్యుత్

అందరికీ 24 గంటల విద్యుత్ కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయు కుదుర్చుకుంది. శుక్రవారం నాడు లక్నోలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు యూపీ మాత్రమే అందరికీ 24 గంటల విద్యుత్ పథకంలోకి రాలేదు. ఇప్పుడు యోగి నేతృత్వంలో యూపీ కూడా వచ్చింది.

English summary
Next time you wonder how successful people manage their busy work schedules; you can take a leaf out of Uttar Pradesh Chief Minister Yogi Adityanath's book.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X