కోవిడ్ పేషెంట్‌కు రోజుకు ఎంత ఆక్సిజన్ అవసరం... ఒక్కో పేషెంట్‌లో ఒక్కోలా... తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..
దేశంలో ఆక్సిజన్ అందక రాలిపోతున్న పేషెంట్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఆక్సిజన్ సపోర్ట్ అవసరమవుతున్న పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం... ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. పలుచోట్ల ఆక్సిజన్ కొరత ఆరోపణలను ప్రభుత్వ యంత్రాంగాలు ఖండిస్తున్నప్పటికీ మృతుల బంధువులు మాత్రం ఆక్సిజన్ అందకపోవడమే మరణాలకు కారణమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఓ కోవిడ్ పేషెంట్‌కు ఎంత ఆక్సిజన్ అవసరం... ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందుకు సరిపోతుందా..? అన్న విషయాలు ఒకసారి పరిశీలిద్దాం...

ఆక్సిజన్ సపోర్ట్ ఎవరికి..?
సాధారణంగా గాలి ద్వారా లభించే ఆక్సిజన్‌ను తీసుకోవడంలో ఇబ్బంది పడే పేషెంట్లకు ఆక్సిజన్ సపోర్ట్ అవసరమవుతుంది. ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావాన్ని బట్టి ఒక్కో పేషెంట్‌కు ఒక్కో మోతాదులో ఆక్సిజన్ అవసరం ఉంటుంది. సగటున 10 శాతం కన్నా తక్కువ కోవిడ్ పేషెంట్లకు మాత్రమే ఆక్సిజన్ అవసరమవుతుంది. చాలా కొద్దిమంది పేషెంట్లకు మాత్రమే హెచ్ఎఫ్ఎన్ఎన్‌సీ (హైఫ్లో నాసల్ క్యాన్వులా) థెరపీ అవసరమవుతుంది.

రోజుకు ఎంత ఆక్సిజన్ అవసరం...
సగటున ఒక వ్యక్తి ఒక నిమిషానికి జరిపే ఉఛ్చాస నిశ్వాసల్లో ఏడు నుంచి ఎనిమిది లీటర్ల గాలిని శ్వాసిస్తాడు. అంటే,ఒకరోజులో దాదాపు 11 వేల లీటర్ల గాలిని శ్వాసిస్తాడు. ఇందులో ఉఛ్వాస ద్వారా 21శాతం ఆక్సిజన్‌ను తీసుకుంటాడు. నిశ్వాస ద్వారా 15 శాతం ఆక్సిజన్‌ను బయటకు వదులుతాడు. అయితే ఊపిరితిత్తులు గ్రహించే దాన్ని బట్టి ఇందులో తేడాలు ఉంటాయి. ఒకవేళ ఊపిరితిత్తులు సరిపోయేంత ఆక్సిజన్‌ను శ్వాసించకపోతే... బయటినుంచి వేరే మెకానిజం ద్వారా దాన్ని అందించాల్సి ఉంటుంది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండే పేషెంట్లలో ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహించలేవు. అలాంటప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ అవసరవమతుంది.

ఆక్సిజన్ ఎప్పుడు అవసరం...
శరీరంలో ఆక్సిజన్ 90 శాతం కన్నా పడిపోతే ఆక్సిజన్ సపోర్ట్ అవసరవమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఆరు నిమిషాల వాకింగ్(సాధారణ నడక) ద్వారా కోవిడ్ పేషెంట్లు స్వీయ పరీక్ష చేసుకోవచ్చు. నడక మొదలుపెట్టే ముందు... నడక పూర్తయ్యేటప్పుడు ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ టెస్టు చేసుకోవాలి.నడక మొదలుపెట్టినప్పటి కన్నా నడక పూర్తయ్యేసరికి శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయినా... మూడు లేదా అంత కన్నా ఎక్కువ శాతం తేడా కనిపించినా... అది వార్నింగ్ సంకేతంగా పరిగణించాల్సి ఉంటుంది.

ఒక్కో పేషెంట్‌లో ఒక్కోలా...
ఆక్సిజన్ అవసరం ఒక్కో పేషెంట్‌లో ఒక్కో రకంగా ఉంటుంది. హెచ్ఎఫ్ఎన్‌సీ సపోర్ట్ అవసరమయ్యే పేషెంట్లకు నిమిషానికి 3600 లీటర్ల ఆక్సిజన్ అవసరం అవొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది 86 వేల లీటర్ల వరకు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఎఫ్ఎన్ఎన్‌సీ సపోర్ట్ అవసరమయ్యే పేషెంట్లకు ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ నిమిషానికి నాలుగు గంటల పాటు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు డిమాండ్ పెరిగింది. గాలిలో లభించే ఆక్సిజన్‌ను ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ప్యూరిఫై చేస్తాయి. హోం ఐసోలేషన్‌లో ఉన్న చాలామంది పేషెంట్లు వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే నిమిషానికి కేవలం 3 లీటర్ల మెడికల్ ఆక్సిజన్ అవసరమైనవారికి మాత్రమే ఇవి పనిచేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ మెడికల్ ఆక్సిజన్ అవసరమైతే ఆస్పత్రిలో చేరాల్సిందేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications