పట్టాలు తప్పిన ముంబై రైలు: నెలలో రెండో ప్రమాదం
Howrah-CSMT Express: మరో రైలు ప్రమాదం సంభవించింది. నెల రోజుల వ్యవధిలో ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురి కావడం ఇది రెండోసారి. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు బయలుదేరిన నంబర్ 12810 ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పింది.
జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ సమీపంలో ఈ తెల్లవారు జామున 3:45 నిమిషాలకు ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒకరు మరణించారు. 60 మంది వరకు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.

చక్రధర్‌పూర్ డివిజన్ పరిధిలోని రాజ్‌ఖర్స్వాన్ వెస్ట్ అవుటర్- బారాబంబూ మధ్య ఈ ప్రమాదం సంభవించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్‌మెంట్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
హౌరా- ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ప్యాసింజర్‌కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. బోగీలన్నీ కూడా పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. మరికొన్ని పక్కకు ఒరిగిపోయాయి. సంఘటనాస్థలంలో ప్రయాణికులు హాహాకారాలు చేయడం కనిపించింది. అంబులెన్సుల సైరన్ మోతలతో ప్రమాద స్థలం భీతావహ వాతావరణం నెలకొంది.
రైలు ప్రమాదం సంభవించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. కిందటి నెల పశ్చిమ బెంగాల్‌లో కాంచన్‌జుంగ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. డార్జిలింగ్‌లో ఈ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు.
ఈ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు స్టేషన్లల్లో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. టాటానగర్ - 06572 290324, చక్రధర్‌పూర్- 06587 238072, రూర్కెలా- 06612501072, 06612500244, హౌరా- 9433357920, 03326382217 నంబర్లతో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటయ్యాయి.
అలాగే.. రాంచీ-27811-5067. హౌరా స్టేషన్- 033-26382217, 9433357920, షాలిమార్- 6295531471, 7595074427, ఖరగ్‌పూర్- 03222-293764, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్- ఆటో నంబర్ 5599222020 040, నాగ్‌పూర్- 7757912790లల్లో వాటిని నెలకొల్పారు.












Click it and Unblock the Notifications