మైనర్ అమ్మాయిని ఏం చేశాడంటే ?, సద్దాం హుస్సేన్ పై కాల్పులు, పోలీసులతో గేమ్స్ ఆడితే !
కర్ణాటకలోని హుబ్బళిలో మరో బాలిక లైంగిక వేధింపులకు గురి అయ్యింది. ఇప్పటికే కాలేజ్ అమ్మాయిని ముస్లీం యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చెయ్యడంతో ఆ సంఘటన కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు అదే హుబ్బళిలో బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడు సద్దాం హుస్సేన్‌పై పోలీసులు కాల్పులు జరపడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు సద్దాం హుస్సేన్ ప్రయత్నించాడు. ఈ సమయంలో పోలీసులు నిందితుడు సద్దాం హుస్సేన్ ను పట్టుకోవడానికి ప్రయత్నించి తరువాత అతని ఎడమ కాలిపై తుపాకితో కాల్చి చివరికి అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడు సద్దాం హుస్సేన్ దాడిలో ధారవాడలోని విద్యాగిరి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ సంగమేష్, కానిస్టేబుల్ అరుణ్ గాయపడి ఆస్పత్రిలో చేరారు.

ప్రస్తుతం గాయపడిన నిందితుడు సద్దాం హుస్సేన్‌ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ధారవాడలోని ధార్వాడ్‌లోని విద్యాగిరి పోలీస్‌స్టేషన్ పోలీసులు నిందితుడు సద్దాం హుస్సేన్‌ను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడు సద్దాం హుస్సేన్ పోలీసు వాహనం ఎక్కుతుండగా ఒక్కసారిగా పోలీసు అధికారులపై కత్తితో దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆత్మరక్షణ కోసం నిందితుడు సద్దాం హుస్సేన్ పై పోలీసులు కాల్పులు జరిపారని పోలీసు అధికారులు తెలిపారు.
నిందితుడు సద్దాం హుస్సేన్ హుబ్బళిలోని ఈశ్వర్ నగర్‌లో నివాసం ఉంటున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. మైనర్ అమ్మాయిని ప్రేమించమని బలవంతపెట్టి ఆమెను లైంగికంగా వేదించాడని, ఆమెపై అత్యాచారం చేశాడని, ఆమెపై శారీరక దాడికి పాల్పడ్డాడని పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయం ఇంట్లో చెబితే నీ ప్రాణాలు తీస్తానని, నిన్ను మాత్రం వదలను అని ఆ అమ్మాయిని సద్దాం హుస్సేన్ బెదిరించాడని పోలీసు అధికారులు తెలిపారు.
గత మూడు, నాలుగు రోజులుగా ఆ బాలిక వాంతులుచేసుకోవడంతో ఆమెను చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అయినా వాంతులు తగ్గకపోవడంతో వైద్యులు ఆమెను పరీక్షించగా ఆ బాలిక గర్భవతి అని నిర్ధారించారు. ఆ సమయంలో బాలికను విచారించగా సద్దాం హుస్సేన్ తనను బెదిరించి లైంగిక దాడి చేశాడని చెప్పిందని పోలీసు అధికారులు తెలిపారు. బాలిక ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడు సద్దాం హుస్పేన్ గురించి పోలీసులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చెయ్యడంతో సద్దాం హుస్సేన్ ను అరెస్టు చెయ్యడానికి వెళ్లిన సమయంలో నిందితుడు కత్తితో దాడి చెయ్యడంతో అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications