వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంపన్నుల జాబితా నుంచి సోనియా పేరు తొలగింపు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రపంచంలోనే 12వ అత్యధిక సంపన్నురాలైన రాజకీయ నేత అని అమెరికాకు చెందిన ఓ న్యూస్ వెబ్‌సైట్ ఇటీవల కథనాన్ని ప్రచురితం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు అసంబద్ధమైన, అపహాస్యం చేసే ఉద్దేశంతో రాసిన కథనంగా తీవ్ర స్థాయిలో వెబ్‌సైట్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో వెబ్‌సైట్ తన కథనాన్ని తప్పుగా ప్రచురితం చేసినట్లు ప్రకటించి సంపన్నుల జాబితా నుంచి సోనియా గాంధీ పేరును తొలగించింది.

సోనియా గాంధీ పేరుతోపాటు ఖతార్ మాజీ రాజు హమీద్ బిన్ ఖలీఫా-థాని పేరునూ హఫింగ్టన్ పోస్ట్ తన కథనం నుంచి తొలగించింది. అంతేగాక సోమవారం సాయంత్రం వారి పేర్లను తొలగించిన తర్వాత ఆ కథనం అప్‌డేట్ చేయబడిందని, ఇదే సంపన్నుల జాబితా అని హఫింగ్టన్ పోస్ట్ ఎడిటర్ పేర్కొన్నారు. థర్డ్ పార్టీ ఇచ్చిన సమాచారం మేరకు సోనియా గాంధీ పేరును సంపన్నుల జాబితా చేర్చామని చెప్పిన ఎడిటర్, ఆ థర్డ్ పార్టీ ఎవరనేది చెప్పకపోవడం గమనార్హం.

Sonia Gandhi

తమ ఎడిటర్స్ సంపద మొత్తాన్ని పరిశీలించే అవకాశం లేకపోయిందని, అందువల్ల లింకును తొలగించామని, ఏదైనా గందగోళానికి గురైనట్లయితే తాము చింతిస్తున్నామని ఎడిటర్ తెలిపారు. నాలుగు రోజుల క్రితం హఫింగ్టన్ పోస్టు ప్రపంచంలోని సంపన్న రాజకీయ నాయకుల జాబితాలో 2 బిలియన్ డాలర్లు కలిగి సోనియాగాంధీ 12 స్థానంలో ఉన్నట్లు ఓ కథనాన్ని ప్రచురితం చేసిన విషయం తెలిసందే. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కథనాన్ని ప్రచురితం చేయడానికి కావాల్సిన విశ్వసనీయత ఉందా అని హఫింగ్టన్ పోస్టును ప్రశ్నించారు.

హఫింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురితం చేసి తమకు చాలా తెలుసునని అనుకుంటోందని భారత సమాచార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రి మనీష్ తివారి సోమవారం న్యూఢిల్లీలో ఆరోపించారు. పోస్ట్ ఈ నమ్మశక్యం కాని కథనం ప్రచురితం చేసి అపహాస్యమవుతుందని తెలిపారు. హఫింగ్టన్ పోస్టు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. కాగా సోనియా గాంధీ సంపద 2 బిలియన్ డాలర్లుగా ఉందని చెప్పిన హఫింగ్టన్ పోస్ట్, అంత మొత్తం ఏ విధంగా వచ్చిందన్న వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.

English summary
An American news website has removed the name of Congress president Sonia Gandhi from the list of richest leaders of the world after the party derided the portal for the "absurd and ridiculous" item.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X