షాక్:జయ మృతిపై రాష్ట్రపతికి అన్నాడిఎంకె నేత ఫిర్యాదు
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వినతి పత్రం సమర్పించారు.
చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంంపై విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వినతి పత్రం సమర్పించారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గ్రూప్ కు చెందిన అన్నాడిఎంకె నాయకుడు మైత్రేయన్ మంగళవారం నాడు రాష్ట్రపతిని కలిశారు.
ఈ నెల ప్రారంభంలో అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరం నుండి మైత్రేయన్ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలో చేరారు మైత్రేయన్.దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఆమె అభిమానుల్లో అనేక అనుమానాలున్నాయని, ఈ విషయమై విచారణ జరిపించాలని మైత్రేయన్ రాష్ట్రపతిని కోరారు.
దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి అపోలో ఆసుపత్రిలో చేరే సమయంలో జ్వరంతో బాదపడుతున్నట్టు వైద్యులు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.కాని, 75 రోజుల వరకు ఆపోలో ఆసుపత్రిలోనే జయలలిత చికిత్స పొందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

75 రోజుల చికిత్స తర్వాత గత ఏడాది డిసెంబర్ 5,వ తేదిన జయలలిత ఆపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మరణించారని ఆయన ప్రస్తావించారు.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయమై డిమాండ్ చేసినా స్పందించలేదని ఆయన చెప్పారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో పళనిస్వామి విజయం సాధించారు.అయితే పన్నీర్ సెల్వం వైపు ఇంకా ఏడుగురు ఎంఏల్ఏలు వస్తే పరిస్థితి తారుమారయ్యేది. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అవుతారని భావించినా చివరకు పళనిస్వామి సిఎంగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకొన్నారు. అయితే శశికళను ఇరుకునపెట్టే వ్యూహన్ని పన్నీర్ సెల్వం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications